New 5 Minute Parking Rule : కొత్త పార్కింగ్ రూల్ ఎఫెక్ట్.. ఏకంగా రూ. 11 లక్షలు పెనాల్టీ చెల్లించిన మహిళ.. ఎక్కడంటే?
New 5 Minute Parking Rule : ట్రాఫిక్ రూల్స్ పాటించినప్పటికీ కూడా ఆమెకు భారీ మొత్తంలో జరిమానాలు పడ్డాయి. ఐదు నిమిషాల కొత్త ట్రాఫిక్ రూల్ ప్రకారం.. ఏకంగా 11,000 పౌండ్ల (రూ. 11,80465) జరిమానా చెల్లించాల్సి వచ్చింది.
New 5 Minute Parking Rule : రోజురోజుకీ ట్రాఫిక్ రద్దీ పెరిగిపోతోంది. ట్రాఫిక్ కంట్రోలింగ్ కోసం కొత్త రూల్స్ అమల్లోకి వస్తున్నాయి. ముఖ్యంగా పార్కింగ్ వంటి రద్దీ ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇలాంటి సమస్యను పరిష్కరించేందుకు యూకేలో 5 నిమిషాల కొత్త పార్కింగ్ రూల్ తీసుకొచ్చారు. దీని కారణంగా ఓ మహిళ భారీగా జరిమానాలను చెల్లించాల్సి వచ్చింది. డార్లింగ్టన్, కౌంటీ డర్హామ్కు చెందిన హన్నా రాబిన్సన్.. ఫీథమ్స్ లీజర్ సెంటర్లో క్రమం తప్పకుండా పార్కింగ్ చేసేవారు.. తాను కారు పార్కించే చేసే ప్రతిసారి కచ్చితంగా చెల్లించేవారు.
ట్రాఫిక్ రూల్స్ పాటించినప్పటికీ కూడా ఆమెకు భారీ మొత్తంలో జరిమానాలు పడ్డాయి. హాస్యాస్పదంగా.. ఐదు నిమిషాల కొత్త ట్రాఫిక్ రూల్ ప్రకారం.. ఏకంగా 11,000 పౌండ్ల (రూ. 11,80465) జరిమానా చెల్లించాల్సి వచ్చింది. యూకేలో ఎక్సెల్ పార్కింగ్ సర్వీసెస్ ద్వారా జనసంచారం ఆపడానికి, పికప్ ప్రాంతంగా కార్ పార్కింగ్‌ను ఉపయోగించకుండా నిరోధించడానికి ఈ కొత్త రూల్ ప్రవేశపెట్టారు. కార్ పార్క్‌కు ప్రవేశం ఏఎన్పీఆర్ కెమెరాల ద్వారా మానిటరింగ్ జరుగుతుంది. ఈ మార్గంలో ప్రవేశించే వాహనం నుంచి నిష్క్రమించే వరకు టైమ్ రికార్డు అవుతుంది.
2021 నుంచి రాబిన్సన్ అనే మహిళ ఒక్కొక్కటిగా 170 పౌండ్లు (రూ. 18వేలు) చొప్పున 67 జరిమానాలను చెల్లించింది. ఆమె ఎప్పుడూ కారును పార్క్ చేయడానికి చెల్లిస్తానని చెప్పింది. అయితే, ఈ కొత్త ట్రాఫిక్ రూల్ ప్రకారం.. కస్టమర్లు వచ్చిన ఐదు నిమిషాలలోపు వారి టిక్కెట్‌ను కొనుగోలు చేయాలి. కార్ పార్క్ లోపల ఇంటర్నెట్ కనెక్టివిటీ లేదు. దాంతో ఆమె పార్కింగ్ టిక్కెట్ చెల్లించలేకపోయింది.
రాబిన్సన్ పార్కింగ్ నియమాలను పాటించినా జరిమానాలు చెల్లించక తప్పలేదు. చట్టబద్ధంగా పార్క్ చేసే డ్రైవర్లపై ఈ రూల్ తీవ్రంగా ప్రభావం చూపుతోంది. “ఇది హాస్యాస్పదం. 5 నిమిషాల పార్కింగ్ రూల్ కారణంగా ఇప్పటివరకూ రూ. 11 లక్షల జరిమానా చెల్లించాను’’ అంటూ రాబిన్సన్ మీడియాకు తెలిపారు. పేలవమైన ఇంటర్నెట్ కనెక్టివిటీ కారణంగా ఈ నిబంధన పార్కర్లను తీవ్రంగా ప్రభావితం చేసింది.