శ్రీరెడ్డి అరెస్ట్ అవుతుందా?: కరాటే కళ్యాణి కంప్లైంట్!

  • Published By: vamsi ,Published On : February 19, 2020 / 04:12 AM IST
శ్రీరెడ్డి అరెస్ట్ అవుతుందా?: కరాటే కళ్యాణి కంప్లైంట్!

Updated On : February 19, 2020 / 4:12 AM IST

ఎప్పుడూ కాంట్రవర్శియల్ కామెంట్లు చేస్తూ సోషల్ మీడియాలో హడావుడి చేస్తుండే నటి శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. క్యాస్టింగ్ కౌచ్ గురించి కామెంట్లు, పవన్ కళ్యాణ్‌పై విమర్శలు, నటులపై ఆరోపణలు ఇలా ఒకటేంటి అన్నిటి గురించి సోషల్ మీడియాలో పెట్టుస్తుంది ఆమె.

తెలుగు సినిమా పరిశ్రమపై ఇక్కడి నటీనటులపై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి చివరకు తమిళ సినిమాల్లో అవకాశాలు రావడంతో చెన్నైకి మకాం మార్చుకుంది. అయితే సోషల్‌ మీడియాలో మాత్రం తన వ్యాఖ్యలతో ఎప్పటికప్పుడు కలకలం రేపుతున్నారు. తమిళ పరిశ్రమలో కూడా ప్రముఖ దర్శకులు ఏఆర్‌ మురుగదాస్, సుందర్‌.సి, నటులు రాఘవ లారెన్స్‌, శ్రీరామ్‌, హీరో విశాల్‌లపై ఆమె ఆరోపణలు చేశారు.

ఈ క్రమంలో ఆమెపై అనేకమంది పోలీసు కేసులు పెట్టారు. అయితే లేటెస్ట్‌గా శ్రీరెడ్డిపై ప్రముఖ నటి కరాటే కల్యాణి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో తనపై శ్రీరెడ్డి అసభ్యకర వ్యాఖ్యలు చేసిందంటూ కరాటే కళ్యాణి పోలీసులకు ఫిర్యదు చెయ్యగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సోషల్ మీడియా లైవ్‌లో అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డిని వెంటనే అరెస్ట్ చెయ్యాలని కరాటే కళ్యాణి కోరగా.. సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్ విచారణ జరపి శ్రీరెడ్డిపై 67 ఐటీ యాక్ట్, 506, 509 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఆమె అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. సోషల్ మీడియాలో వ్యక్తుల ప్రతిష్టను కించపరిచేలా కామెంట్స్ చేయడం చట్టరీత్యా నేరం అని వారిపై చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సీపీఎస్ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ వెల్లడించారు.

Read More>>తండ్రికి తగ్గ తనయుడు : 2నెలల్లో మళ్లీ డబుల్ సెంచరీ బాదిన జూ. రాహుల్ ద్రవిడ్