Viral Video: తనకు కిడ్నీ దానం చేసింది తన కూతురే అని తెలుసుకుని తండ్రి కన్నీరు

ఓ వ్యక్తి కిడ్నీ పూర్తిగా చెడిపోవడంతో ఆయనకు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. అందుకు వైద్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేస్తారు. అయితే, తనకు కిడ్నీ దానం చేసింది ఎవరన్న విషయాన్ని ఆయనకు వైద్యులు చెప్పరు. శస్త్రచికిత్స పూర్తయ్యాక ఆయన వద్దకు ఆయన కూతురిని తీసుకువస్తారు.

Viral Video: తనకు కిడ్నీ దానం చేసింది తన కూతురే అని తెలుసుకుని తండ్రి కన్నీరు

Viral Video

Updated On : March 1, 2023 / 6:59 PM IST

Viral Video: తండ్రీకూతుళ్ల మధ్య ఉండే బంధం మధురాతి మధురం. తన తండ్రే తన హీరో అయి జీవితాంతం చెప్పుకుంటుంది కూతురు. తన చిట్టితల్లి కోసం ఎన్నో మధురమైన జ్ఞాపకాల్ని మిగిలిస్తాడు తండ్రి. ఆమెను అనుక్షణం కాపాడుకుంటూ ఎంతో ప్రేమగా పెంచుతాడు. అటువంటి తండ్రి కోసం కూతురు ఏం చేయగలదు? ఏం చేసినా తక్కువే. అయితే, కూతురి నుంచి తండ్రి ఏమీ ఆశించడు. తండ్రీకూతుళ్ల మధ్య అనుబంధం ఎంత మధురంగా ఉంటుందో తెలిపే ఘటనకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది.

ఓ వ్యక్తి కిడ్నీ పూర్తిగా చెడిపోవడంతో ఆయనకు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. అందుకు వైద్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేస్తారు. అయితే, తనకు కిడ్నీ దానం చేసింది ఎవరన్న విషయాన్ని ఆయనకు వైద్యులు చెప్పలేదు. శస్త్రచికిత్స పూర్తయ్యాక ఆయన వద్దకు ఆయన కూతురిని తీసుకువస్తారు.

తనకు కిడ్నీ దానం చేసిన వ్యక్తి తన కూతురేనని తెలుసుకుని ఆ తండ్రి కన్నీరు పెట్టుకుంటారు. ఆ సమయంలో తీసిన వీడియో వైరల్ అవుతోంది. ఇంటెరెస్టింగ్ ఛానల్ అనే ట్విట్టర్ పేజీలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. అటువంటి కూతురు దొరకడం ఆ తండ్రి అదృష్టమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కంటే కూతుర్నే కనాలని ఒకరు పేర్కొన్నారు.

#Twitter Down : ట్విట్టర్‌కు ఏమైంది.. మళ్లీ నిలిచిపోయిన సర్వీసులు.. మస్క్‌పై మండిపడుతున్న యూజర్లు.. ఉద్యోగుల తొలగింపు కారణమా?