Hyderabad : భాగ్యనగరానికి బహు దగ్గరలో.. చలో వర్షాకాలం టూర్
ఈసారి ఎప్పుడూ లేనంతగా ఎండలు ఇబ్బంది పెట్టేశాయి. భానుడు శాంతించి వరుణుడు కరుణించాలని అంతా కోరుకుంటున్నారు. ఈసారి చాలామంది సమ్మర్ టూర్లు కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. అలాంటివారు వర్షాకాలంలో జాలీగా ట్రిప్ వేయండి. ఎక్కడికో దూరాలు వెళ్లనక్కర్లేదు.. హైదరాబాద్‌కి దగ్గర్లో ఎంతో అందమైన ప్రాంతాలున్నాయి. అవేంటో ఓ లుక్ వేయండి.

Hyderabad
Hyderabad – Tourist Places : ఈసారి ఎండాకలం భానుడు తీవ్ర ప్రతాపం చూపించాడు. తెలుగు రాష్ట్రాల(Telugu States) ప్రజలు వేడికి అల్లల్లాడిపోయారు. వర్షాల కోసం ఎప్పుడూ లేనంతగా ఎదురుచూస్తున్నారు. సమ్మర్ (Summer)లో చాలామంది విహారయాత్ర (Holiday Tour)లకు వెళ్లేవారు కూడా భయపడి ఇంటిపట్టునే ఉండిపోయారు. భానుడు కాస్త ఉపశమించి వరుణుడు కరుణిస్తే ఎక్కడికో వెళ్లనక్కర్లేదు.. హైదరాబాద్‌కి సమీపంలో చూడదగిన ప్రాంతాలు చాలా ఉన్నాయి. రా.. రమ్మంటున్న ఆ ప్రాంతాలేవిటో చదవండి.
బడ్జెట్ ఫ్రెండ్లీ టూరిస్ట్ కంట్రీస్ ఇవే
సమ్మర్‌లో ఫ్యామిలీతో లేదా స్నేహితులతో కలిసి ఏదైనా టూర్ ప్లాన్ చేసి ఉంటారు.. ఎండలకు భయపడి మానేసి ఉంటారు. వర్షం రాగానే వాతావరణం చల్లబడగానే కాస్త విశ్రాంతి కోరుకునేవారు.. రొటీన్ లైఫ్ బోర్ కొట్టి కాస్త డైవర్షన్ కావాలనుకునే వారు చక్కని టూర్ ప్లాన్ చేసుకోండి. ఎక్కడికో వెళ్లనక్కర్లేదు భాగ్యనగరానికి చేరువలో ఉన్న ప్రాంతాలతో పాటు.. మరికాస్త దూరంలో అందమైన ప్రదేశాలు చాలా ఉన్నాయి. జలజల పారే సెలయేర్లు, పచ్చని ప్రకృతి దృశ్యాలు మనసుని కట్టిపడేసి మనలోని ఒత్తిడిని దూరం చేస్తాయి.
వర్షాకాలంలో చూడదగిన ప్రాంతాల్లో హైదరాబాద్‌కి 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న బీదర్ ఒకటి. ఇది కర్నాటకలోని ఈశాన్య భాగంలో ఉంది. ఇక్కడ 15వ శతాబ్దానికి చెందిన కట్టడాలు అబ్బురపరుస్తాయి. బీదర్ కోట ఇక్కడ ప్రధాన ఆకర్షణ. వర్షాకాలంలో ఇక్కడ చూడదగినది సింగూరు డ్యామ్. ఆహ్లాదకరమైన వాతావరణంతో అక్కడి వాతావరణం ఆకట్టుకుంటుంది.
టూరిస్ట్ స్పాట్_గా కాగజ్ నగర్ అడవులు
శ్రీశైలం హైదరాబాద్‌కు 230 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పుణ్యక్షేత్రంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి కొలువై ఉన్నారు. ఎక్కడ చూసిన పచ్చదనం కనిపిస్తుంది. రెండు రోజులు సెలవు దొరికితే శ్రీశైలం ప్లాన్ చేసుకోండి. ఈ సీజన్‌లో డామ్ గేట్లు తెరుస్తారు. అటు దేవుని దర్శనం.. ఇటు డ్యామ్ సందర్శనం రెండు ప్లాన్ చేసుకోవచ్చు.
హైదరాబాద్‍కి 377 కిలోమీటర్ల దూరంలో ఉంది హంపి. 14వ శతాబ్దంలో నిర్మించబడింది. తుంగభద్ర నది ఒడ్డున ఉన్న ఈ నగరం అంతా పచ్చదనంతో నిండి ఉంటుంది. ప్రకృతి ప్రేమికులను ఈ ప్రాంతం ఎంతగానో ఆకట్టుకుంది. అనంతగిరి హిల్స్ ఇవి హైదరాబాద్‌కి 79 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇదో చిన్న హిల్ స్టేషన్. ఒకరోజు సరదాగా వెళ్లాలనుకునేవారికి కూడా ఇది చూడాల్సిన ప్రాంతం. కొండల పైకి ట్రెక్కింగ్ మరియు క్యాంపింగ్ చేయచ్చు. వర్షాకాలంలో ఈ ప్రాంతానికి చాలామంది టూరిస్టులు వస్తుంటారు. అందమైన చెట్లు.. జంతువులు.. మంచినీటి ప్రవాహాలతో మనసుని దోచే ఈ ప్రాంతాన్ని తప్పక చూడాల్సిందే.
Mahurgad Ekaveerikadevi : సతీదేవి కుడిస్తనం పడిన మహిమాన్విత క్షేత్రం .. శ్రీ ఏకవీరికాదేవి శక్తి పీఠం
పోచారం ఆనకట్ట మరియు అభయారణ్యం ఇది హైదరాబాద్‌కు 109 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది. వర్షాకాలం మొదలు కాగానే చెక్ డ్యాం నుంచి వచ్చే నీటి ప్రవాహం.. 130 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న పచ్చని అడవులు ఆకట్టుకుంటాయి. ఎకో టూరిజం సెంటర్‌లో జింకలు, మొసళ్లు, కొంగలతో పాటు పలురకాల జాతుల జంతువులు, పక్షలు ఇక్కడ కనిపిస్తాయి.
భాగ్యనగరం నుంచి 400 కిలోమీటర్ల పైన ఉన్న అద్భుతమైన ప్రదేశాలు కూడా ఉన్నాయి. సెలవులు ఎక్కువగా దొరికితే ఈ ప్రాంతాలకు టూర్ ప్లాన్ చేసుకోవచ్చు. భాగ్యనగరానికి 571 కిలోమీటర్ల దూరంలో ఉంది లంబసింగి. ఆంధ్రాలో ఉండే ఈ గ్రామాన్ని దక్షిణ భారతదేశంలో కాశ్మీర్ అని పిలుస్తారు. ఇక్కడ ఎంతో ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది. ఇక్కడ బ్రిటీష్ పాలనలో ప్రారంభించబడిన కాఫీ, మరియు మిరియాల తోటలను చూడచ్చు.
Goa Beach: గోవా బీచ్‌కు వెళ్తున్నారా? ఈ కొత్త రూల్స్ పాటించకుంటే జేబులకు చిల్లు తప్పదు..
ఊటీ హైదరాబాద్‌కి 846 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎంతో ప్రసిద్ధి చెందిన హిల్ స్టేషన్‌లలో ఇది ఒకటి. నీలిగిరి పర్వతాలపై ప్రశాంతమైన వాతావరణంలో అందమైన ప్రకృతి దృశ్యాలను చూసి ఆస్వాదించవచ్చును. లోనావాలా ఇది హైదరాబాద్‌కి 624 కిలోమీటర్ల దూరంలో ఉంది. పుణేలోని ప్రసిద్ధి చెందిన హిల్ టౌన్ ప్రాంతం ఇది. పచ్చదనంతో నిండిన లోయలతో ట్రెక్కింగ్‌కి ఈ ప్రాంతం ఎంతో ప్రసిద్ధి. వర్షాకాలంలో రొమాంటిక్ విహార యాత్ర ప్లాన్ చేసుకునే కపుల్స్‌కి ఇది అనువైన ప్రాంతం. కూర్గ్ హైదరాబాద్‌కి 825 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఒక ఆధ్యాత్మిక ప్రాంతం. ఇక్కడి అందమైన వాతావరణం.. పచ్చదనం తిరిగి వెళ్లాలనిపించనంతగా కట్టిపడేస్తుంది. ఇక్కడి వారి ఆతిథ్యం మరువలేం.
ఇవి.. హైదరాబాద్‌కి అతి సమీపంలోనూ.. 400 కిలోమీటర్లపైన దూరంలో ఉన్న అద్భుతమైన ప్రాంతాలు. మరీ ముఖ్యంగా వర్షాకాలంలో టూర్ ప్లాన్ చేసుకునేవారికి అనువైన ప్రాంతాలు. బిజీ లైఫ్‌లో పడి కాస్త విశ్రాంతి కోరుకునేవారు వేసవి నుంచి కాస్త ఉపశమనం కావాలనుకునేవారు ఆలస్యం చేయకుండా ప్లాన్ చేసుకోండి. తిరిగొచ్చాక రొటీన్ లైఫ్‌ని ఉత్సాహంగా ప్రారంభించండి.