Shakunthalam : శాకుంతలం సినిమా గురించి సీక్రెట్స్ చెప్పిన సమంత.. ఈ సినిమా వల్ల హెల్త్ సమస్యలు వచ్చాయంట..

ప్రమోషన్స్ లో భాగంగా సమంత సినిమా గురించి, తన గురించి చాలా ఆసక్తికర విషయాలు తెలుపుతుంది. తాజాగా శాకుంతలం గురించి 5 క్రేజీ థింగ్స్ అంటూ ఓ వీడియోని రిలీజ్ చేసి ఆసక్తికర విషయాలను తెలిపింది సమంత.

Shakunthalam : శాకుంతలం సినిమా గురించి సీక్రెట్స్ చెప్పిన సమంత.. ఈ సినిమా వల్ల హెల్త్ సమస్యలు వచ్చాయంట..

Samantha revealed crazy things about Shakunthalam movie

Updated On : April 12, 2023 / 6:44 AM IST

Shakunthalam :  సమంత మయోసైటిస్ నుంచి కోలుకున్నాక ఫుల్ జోష్ తో కంబ్యాక్ ఇస్తుంది. ఓ పక్క ఖుషి(Kushi), సిటాడెల్(Citadel) షూటింగ్స్ తో బిజీగా ఉంటూనే మరోవైపు శాకుంతలం(Shakunthalam) సినిమా ప్రమోషన్స్ చేస్తూ బిజీబిజీగా ఉంది. మన పురాణాల్లోని దుశ్యంతుడు-శకుంతల కథ ఆధారంగా గుణశేఖర్(GunaSekhar) దర్శకత్వంలో తెరకెక్కిన శాకుంతలం సినిమా ఏప్రిల్ 14న పాన్ ఇండియా(Pan India) రిలీజ్ కాబోతుంది. దీంతో సమంత, చిత్రయూనిట్ ఇండియా అంతటా ప్రమోషన్స్ భారీగా చేస్తున్నారు.

ఈ ప్రమోషన్స్ లో భాగంగా సమంత సినిమా గురించి, తన గురించి చాలా ఆసక్తికర విషయాలు తెలుపుతుంది. తాజాగా శాకుంతలం గురించి 5 క్రేజీ థింగ్స్ అంటూ ఓ వీడియోని రిలీజ్ చేసి ఆసక్తికర విషయాలను తెలిపింది సమంత.

Samantha : నాకు అన్ని ఉన్నప్పుడు హ్యాపీగా ఉన్నాను.. కానీ ఆ టైంలో చాలా స్ట్రగుల్ అయ్యాను.. 

ఈ వీడియోలో సమంత మాట్లాడుతూ..

#నాకు పూలు అంటే ఎలర్జీ ఉంది. కానీ ఈ సినిమాలో ప్రతి సీన్ లోను మెడలో, చేతికి పూలు కట్టుకొని ఉండాలి. దాని వల్ల చేతికి, మెడ చుట్టూ దద్దుర్లు వచ్చేసి టాటూల్లాగా కనపడేవి. సినిమా జరుగుతున్నంత కాలం అవి మేకప్ తో కవర్ చేశారు. అవి తగ్గడానికి ఆరు నెలలు పట్టింది.

#ఈ పాత్రకు నేనే మూడు భాషల్లో తెలుగు, తమిళ్, హిందీలో డబ్బింగ్ చెప్పుకున్నాను. ఇది చాలా కష్టంగా అనిపించింది. వేరే యాక్టర్స్ ఎలా చెప్తున్నార్రా బాబు అనుకునే దాన్ని. నిద్రలో కూడా అవే డైలాగ్స్ కలలోకి వచ్చేవి.

#సినిమా షూటింగ్ లో నన్ను ఓ కుందేలు కరిచింది. సినిమాలో నిజమైన కుందేళ్ళను కొన్ని సీన్స్ లో వాడాము. ఓ కుందేలు అంత క్యూట్ గా లేదు. అసలు నాకు ఆ కుందేలు నచ్చలేదు.

#ఈ సినిమాలో నాది ఒరిజినల్ జుట్టు కాదు. సీన్స్ కు తగ్గట్టు విగ్స్ వాడాము.

#శాకుంతలం సినిమాలో ఓ పాటలో వేసిన డ్రెస్ ఏకంగా 30 కేజీలు ఉంది. దాంతో చాలా ఇబ్బంది పడ్డాను. పాటలో ఆ లెహంగా వేసుకొని రౌండ్ తిరుగుతున్నప్పుడు కెమెరా ఫ్రేమ్ నుంచి పక్కకి వెళ్లిపోతుంటే కెమెరామెన్ గట్టిగా అరిచారు. నేను వెళ్లట్లేదు, ఈ లెహంగానే తీసుకువెళ్తుంది అని చెప్పడంతో సెట్ లో అంతా నవ్వుకున్నారు అని తెలిపింది. ఇలా శాకుంతలం సినిమా గురించి క్రేజీ థింగ్స్ చెప్పడంతో ఈ వీడియో వైరల్ గా మారింది.