Six Wickets: ఒకే ఓవర్లో అద్భుతం.. ఐదు అవుట్‌లు, ఒక రనౌట్
టోర్నమెంట్ చిన్నదైనా జరిగిన తీరు అద్భుతం. ఒకే ఓవర్లో ఐదు అవుట్స్ ప్లస్ ఒక రనౌట్. కళ్ల ముందే టపాటపా వికెట్లు పడిపోతుంటే స్టేడియంలో అభిమానుల ఉత్సాహం ఏ రేంజ్ లో ఉండి ఉండాలో..

Six Wickets
Six Wickets: టోర్నమెంట్ చిన్నదైనా జరిగిన తీరు అద్భుతం. ఒకే ఓవర్లో ఐదు అవుట్స్ ప్లస్ ఒక రనౌట్. కళ్ల ముందే టపాటపా వికెట్లు పడిపోతుంటే స్టేడియంలో అభిమానుల ఉత్సాహం ఏ రేంజ్ లో ఉండి ఉంటుందో..! ఈ సీన్ మొత్తం నేపాల్ ప్రో క్లబ్ ఛాంపియన్‌షిప్‌లో నమోదైంది. నేపాల్ ప్రో క్లబ్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా పుష్ స్పోర్ట్స్ ఢిల్లీ, మలేషియా IX జట్ల మధ్య మంగళవారం జరిగింది.
మలేషియా IX బౌలర్ విరన్‌దీప్ సింగ్ ఆఖరి ఓవర్లో 6 వికెట్లు పడగొట్టి చరిత్ర లిఖించాడు. తొలి బంతిని వైడ్‌గా వేసిన విరన్ దీప్.. ఆ తర్వాత వరుసగా 6 వికెట్లు పడగొట్టాడు. ఇందులో హ్యాట్రిక్ సహా, ఓ రనౌట్ కూడా ఉండటం ప్రత్యేకం.
ధాటిగా ఆడుతూ.. 19వ ఓవర్ వరకు 131/3 స్కోరుతో పటిష్టమైన స్థితిలో కనిపించింది పుష్ స్పోర్ట్స్ దిల్లీ జట్టు. అలాంటిది విరన్ దీప్ మాయాజాలానికి 132/9 స్కోరుకే పరిమితమై చాపచుట్టేసింది. అలా పుష్ స్పోర్ట్స్ ఢిల్లీ జట్టు 132/9 స్కోరు నమోదు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మలేషియా IX విరన్ దీప్ కష్టానికి ప్రయోజనం లేకుండా చేసింది. 17.3 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
Read Also : 31 రన్స్ కే ఇండియా 3వికెట్లు డౌన్
1951 థామస్ హంటర్ కప్‌లోనూ ఇలాంటి ఘటన ఇంతకు ముందు చోటు చేసుకుంది.
6️⃣ wickets in 6️⃣ balls – have you ever seen it before?! ?
Five wickets for Malaysia XI's Virandeep Singh plus a run-out in the final over against Push Sports Delhi in the Nepal Pro Club Championship ? pic.twitter.com/eBTrlNwLuY
— ESPNcricinfo (@ESPNcricinfo) April 12, 2022