South Eastern Railway Recruitment 2023 : సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వేలో 1,785 యాక్ట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీ..అర్హులు ఎవరంటే ?

50 శాతం మార్కులతో పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హతతోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు

South Eastern Railway Recruitment 2023 : సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వేలో 1,785 యాక్ట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీ..అర్హులు ఎవరంటే ?

South Eastern Railway Recruitment 2023

South Eastern Railway Recruitment 2023 : కోల్‌కతా ప్రధానకేంద్రంగా పనిచేస్తున్న సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వే (SER) వివిధ డివిజన్‌లలో యాక్ట్ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీ చేపట్టనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1785 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్ధులు అర్హులు. అర్హతలు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు డిసెంబరు 28 చివరి గడువుగా నిర్ణయించారు.

READ ALSO : Reproduction Techniques : గేదెల పునరుత్పత్తిలో.. మెళకువులు

వివరాలు..

యాక్ట్ అప్రెంటిస్:1,785 ఖాళీలు

ఖాళీలు ఉన్న విభాగాలు ;

ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, పెయింటర్, మెషినిస్ట్, టర్నర్, మెకానిక్ డీజిల్, ట్రిమ్మర్, ఎంఎంటీఎం, ఫోర్జర్ అండ్‌ హీట్ ట్రీటర్, రిఫ్రిజిరేటర్ అండ్‌ ఏసీ మెకానిక్, లైన్‌మ్యాన్.

ఖాళీలు భర్తీ చేయనున్న ఆర్‌ఆర్‌సీ వర్క్‌షాప్‌లు:

ఖరగ్‌పూర్ వర్క్‌షాప్, సిగ్నల్ అండ్‌ టెలికాం(వర్క్‌షాప్)(ఖరగ్‌పూర్), ట్రాక్ మెషిన్ వర్క్‌షాప్ (ఖరగ్‌పూర్), ఎస్‌ఎస్‌ఈ(వర్క్స్)/ ఇంజినీరింగ్ (ఖరగ్‌పూర్), క్యారేజ్ అండ్‌ వ్యాగన్ డిపో (ఖరగ్‌పూర్), డీజిల్ లోకో షెడ్ (ఖరగ్‌పూర్), సీనియర్‌ డీఈఈ (జి) (ఖరగ్‌పూర్), టీఆర్‌డీ డిపో/ ఎలక్ట్రికల్ (ఖరగ్‌పూర్), ఈఎంయూ షెడ్/ ఎలక్ట్రికల్ (టీపీకేఆర్‌), ఎలక్ట్రిక్ లోకో షెడ్ (సంత్రగచి), సీనియర్‌ డీఈఈ (జి)(చక్రధర్‌పూర్), సీనియర్‌ డీఈఈ (జి)(ఆద్రా), క్యారేజ్ అండ్‌ వ్యాగన్ డిపో(ఆద్రా), డీజిల్ లోకో షెడ్(బీకేఎస్‌సీ), టీఆర్‌డీ డిపో/ఎలక్ట్రికల్(ఆద్రా), ఎలక్ట్రిక్ లోకో షెడ్(బీకేఎస్‌సీ), ఎలక్ట్రిక్ లోకో షెడ్(ఆర్‌వోయూ), ఎస్‌ఎస్‌ఈ(వర్క్స్)/ ఇంజినీరింగ్ (ఆద్రా), క్యారేజ్ అండ్‌ వ్యాగన్ డిపో (రాంచీ), సీనియర్‌ డీఈఈ (జి)(రాంచీ), టీఆర్‌డీ డిపో/ ఎలక్ట్రికల్(రాంచీ), ఎస్‌ఎస్‌ఈ(వర్క్స్)/ఇంజినీరింగ్ (రాంచీ), ఎలక్ట్రిక్ ట్రాక్షన్ డిపో(చక్రధర్‌పూర్), క్యారేజ్ అండ్‌ వ్యాగన్ డిపో(చక్రధరపూర్), ఎలక్ట్రిక్ లోకో షెడ్(టాటా), ఇంజినీరింగ్ వర్క్‌షాప్ (సిని), ట్రాక్ మెషిన్ వర్క్‌షాప్(సిని), ఎస్‌ఎస్‌ఈ(వర్క్స్)/ ఇంజినీరింగ్ (చక్రధర్‌పూర్), ఎలక్ట్రిక్ లోకో షెడ్(బండాముండా), డీజిల్ లోకో షెడ్(బండాముండా).

READ ALSO : Stomach Cancer : పొట్టలో తరచూ ఇబ్బందికలుగుతుందా ? అయితే జాగ్రత్త పడాల్సిందే..

అర్హత:

50 శాతం మార్కులతో పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హతతోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు

వయోపరిమితి:

15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తుంది.

READ ALSO : Allu Arjun : సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌కి ఫాలోవర్స్ పెరగాలంటూ.. అల్లు అర్జున్ వీడియో..

దరఖాస్తు ఫీజు:

రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం:

ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

READ ALSO : MGBS : ఓటేసేందుకు సొంతూళ్లకు తరలి వెళ్తున్న ప్రజలు.. ఎంజీబీఎస్ బస్టాండ్ లో కిక్కిరిసిన ప్రయాణికులు

ఎంపిక విధానం:

మెట్రిక్యులేషన్‌, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 28.12.2023.

పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.rrcser.co.in/