TG Education Kits : విద్యార్థులకు సర్కార్ శుభవార్త.. 9.5 లక్షల మందికి ఫ్రీగా ఆ 24 వస్తువులు
TG Education Kits :
Telangana government provide education kits for 9 5 lakh students
విద్యార్థులకి రేవంత్ సర్కార్ శుభవార్త
9.5 లక్షల మంది విద్యార్థులకు కిట్లు
8-డిగ్రీ విద్యార్థినిల యూనిఫామ్ మార్పు
TG Education Kits : తెలంగాణ సర్కార్.. రాష్ట్రంలో గవర్నమెంట్, ప్రభుత్వ సొసైటీలు, స్థానిక సంస్థల పాఠశాలలు, హాస్టళ్లలో చదువుతున్న ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు విద్యార్థులకు శుభవార్త చెప్పింది. వారికి 24 వస్తువులను పూర్తి ఉచితంగా అందించనుంది. ప్రభుత్వం నిర్ణయం ద్వారా రాష్ట్రంలో ఒకటి నుంచి డిగ్రీ వరకు చదువుతున్న దాదాపు 9.5 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. వీరందరికి.. గవర్నమెంట్ వాటర్ మార్క్ లోగోతో కూడిన ఎడ్యుకేషన్ కిట్లు అందనున్నాయి. గురుకులాల్లో డిగ్రీ చదువుతున్న స్కూడెంట్స్ కి.. ఈ కిట్‌లోని ప్రతి వస్తువు అందించాలని సర్కార్ నిర్ణయించింది. విద్యార్థులకు అందించాల్సిన వస్తువుల వివరాలను టెండరు ప్రకటనలో పేర్కొంది.
ఈక్రమంలోఎల్-1గా ఎంపికైన కాంట్రాక్టర్ కు.. ఈఎండీ డబ్బును సర్దుబాటు చేయడంతో పాటు.. మిగతా డబ్బుని.. సెక్యూరిటీ డిపాజిట్ కింద చెల్లించాలని నిర్ణయించారు. ఒకవేళ సదరు కాంట్రాక్టర్ విఫలమైతే.. ఒకవేళ విఫలమైతే ఆ మొత్తాన్ని జప్తు చేస్తామని ప్రకటనలో వెల్లడించింది. ఎల్-1గా ఎంపికైన కాంట్రాక్టర్ తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలకు ఆయా వస్తువుల సరఫరా చేసే బాధ్యత తీసుకోవాలని సూచించింది. అలానే కిట్ లో ఇచ్చే వస్తువులు పక్కదారి పట్టకుండా వాటిని ట్రాక్ చేసేలా చర్యలు తీసుకుంటుంది. దీంతో పాటు 8వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదివే విద్యార్థినుల కోసం యూనిఫామ్ లో మార్పులు చేయాలని సర్కార్ భావిస్తోంది.
అందరికీ ఐడీ కార్డులు, స్టేషనరీ కిట్లు..
ప్రభుత్వ సంక్షేమ గురుకులాలు, KGBVలు, హాస్టళ్లు, మోడల్‌స్కూల్స్, గవర్నమెంట్, స్థానిక సంస్థల, గిరిజన పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఐడీకార్డులిస్తారు. చిన్నపిల్లల నుంచి డిగ్రీ విద్యార్థులందరికీ స్టేషనరీకిట్లు ఇవ్వనున్నారు. దీనిలో బ్లూ, రెడ్ పెన్నులు, ప్లాస్టిక్ స్కేలు, పౌచ్, స్కెచ్ పెన్నులు, పెన్సిల్ బాక్సు, షార్పనర్లు, పరీక్షప్యాడ్ వంటివి ఉండనున్నాయి. చిన్నపిల్లలకు క్రేయాన్స్ ఉంటాయి. దీంతో పాటు.. తరగుతల వారీగా విద్యార్థుల కోసం పలు పరిమాణాల్లో స్కూల్ బ్యాగులు రెడీ చేస్తున్నారు.
1-3 తరగతి వరకు 25 లీటర్లు,
4-8 తరగతి వరకు 30 లీటర్లు,
9 నుంచి డిగ్రీ వరకుచదివే విద్యార్థులకు 35 లీటర్ల పరిమాణంతో కూడిన బ్యాగులు అందుతాయి.
వీటితో పాటు స్కూడెంట్స్ కి ప్లేట్, హ్యాండిల్ కప్, గ్లాస్, స్పూన్, కటోరాలను కలిపి ఒకసెట్గా సరఫరా చేయాలని ప్రభుత్వం సూచించింది.
అలానే విద్యార్థులకిచ్చే బ్లాకెంట్ చివరి అంచులపై ప్రభుత్వ లోగో… విద్యాసంస్థ, సొసైటీని వేగంగా గుర్తించేలా కలర్ స్కీమ్ ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.
