Mla Anirudh Reddy: అందుకే.. డ్రగ్స్ టెస్ట్ చేయించుకుందామని చెప్పా- ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
ప్రత్యేక రాష్ట్రం వచ్చి 12 ఏళ్లు అవుతున్నా ఆంధ్రా వాళ్లు ఇంకా మాపైనే ఎందుకు పడుతున్నారు. అన్ని వ్యాపారాలు మీరే ఎందుకు చేస్తున్నారు?
Anirudh Reddy: 10టీవీ వీకెండ్ పాడ్ కాస్ట్ లో కాంగ్రెస్ నేత, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పలు అంశాలపై మాట్లాడారు. కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా వాళ్లు, రాజకీయ నాయకులు డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలి అని ఎందుకు అనాల్సి వచ్చింది అన్నదానిపై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
”సినిమా వాళ్లను, రాజకీయ నాయకులను ఆదర్శంగా తీసుకుంటారు. అందుకే డ్రగ్స్ టెస్ట్ చేయించుకుని అందరికీ ఆదర్శంగా ఉందామని చెప్పా. నేను మంచి ఉద్దేశంతో చెబితే సినిమా వాళ్లు దాన్ని డైవర్ట్ చేస్తున్నారు. రాజకీయ నాయకులు అంటే తమాషాగా ఉందా? రాజకీయ నాయకుల గురించి చీప్ గా మాట్లాడితే మర్యాద ఉండదు. మా త్యాగాల గురించి మీకు ఏం తెలుసు? మీరు డ్యాన్స్ చేస్తే పైసలు వస్తాయి. మేము అలా కాదు. మా ఆస్తులు అమ్ముకుని వచ్చాం. ప్రజల సమస్యలు ఉంటే ఇంట్లో వాళ్లను కూడా వదిలేసి వెళ్తాం. అటువంటి రాజకీయ నాయకుల గురించి ఇష్టానుసారంగా మాట్లాడతారా? నేను ఆస్తులు అమ్ముకుని రాజకీయాల్లోకి వచ్చా. ఎమ్మెల్యే అయ్యాక కూడా నేను 7 ఎకరాలు అమ్ముకున్నా. సినీ ఫీల్డ్ వాళ్లు డ్రగ్స్ తీసుకోవడం లేదు కదా? అందుకే రిపోర్టులు తీసి బయటపెట్టండి.
ప్రత్యేక రాష్ట్రం వచ్చి 12 ఏళ్లు అవుతున్నా ఆంధ్రా వాళ్లు ఇంకా మాపైనే ఎందుకు పడుతున్నారు. అన్ని వ్యాపారాలు మీరే ఎందుకు చేస్తున్నారు? తెలంగాణ వాళ్లకు డబ్బు మీద ఆశ ఉండదు. మేము సెంటిమెంటల్ పీపుల్. మీకు మనీ, బిజినెస్ లు ఇంపార్టెంట్ కావొచ్చు. మమ్మల్ని ఏదో ఒకటి అంటే ఊరుకునేది లేదు” అని హెచ్చరించారు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి.
