Anirudh Reddy Podcast: అందుకే పవన్ కల్యాణ్ సినిమాలు అడ్డుకుంటానన్నా.. తెలంగాణలో ఆయనకు ఏం పని?- ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
ఆయన ఏపీ డిప్యూటీ సీఎం, ఏపీలోనే ఉండాలి కదా. అక్కడి ప్రజలు పవన్ ను గెలిపించారు. మరి విజయవాడలో ఉండాలి కదా. అక్కడి ప్రాంతాలన్నీ తిరగాలి కదా.
Anirudh Reddy podcast 10tv
Anirudh Reddy: 10టీవీ వీకెండ్ పాడ్ కాస్ట్ లో కాంగ్రెస్ నేత, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పలు అంశాలపై మాట్లాడారు. కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సినిమాలు అడ్డుకుంటాను అని ఎందుకు అనాల్సి వచ్చిందో అనిరుధ్ రెడ్డి వివరించారు.
”తెలంగాణ వాళ్లు వ్యాపారాల్లోకి రావాలి. పైసలే ముఖ్యంగా భావించి వ్యాపారం చేసే లాంటి వాళ్లు ఎక్కువ మంది తెలంగాణలో లేరు. తెలంగాణ ప్రజల్లో మార్పు రావాలి. టెండర్లలో పాల్గొనాలి. తెలంగాణ వాళ్ల నరదిష్టి అని పవన్ కల్యాణ్ అనడం కరెక్ట్ కాదు. అలా ఎందుకు అన్నారు? క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసినా చెప్పలేదు. ఆయన లేటెస్ట్ సినిమా ఫస్ట్ షో ఎండింగ్ అయిపోయేలోపే ఫ్లాప్ అయ్యింది. పవన్ కల్యాణ్ క్షమాపణ చెప్పి ఉంటే తెలంగాణలో ఉండే వాళ్లంతా వెళ్లి పిక్చర్ చూసే వాళ్లు. బాగోలేకపోయినా సినిమా చూసి హిట్ చేసేవాళ్లు.
తెలంగాణలో పవన్ కు మా పోలీసులు ప్రొటెక్షన్ ఇస్తున్నారు. పవన్ ఏపీలో ఉండొచ్చు కదా? ఇక్కడ ఆయనకు ఏం పని? ఆయన ఏపీ డిప్యూటీ సీఎం, ఏపీలోనే ఉండాలి కదా. అక్కడి ప్రజలు పవన్ ను గెలిపించారు. మరి విజయవాడలో ఉండాలి కదా. అక్కడి ప్రాంతాలన్నీ తిరగాలి కదా. హైదరాబాద్ లో పవన్ కల్యాణ్ ఎందుకు ఉంటున్నారు? శాలరీ ఏపీ ప్రభుత్వం నుంచి తీసుకుంటున్నారు. ప్రభుత్వం ఏమో ఉండేది అక్కడ, పవన్ కల్యాణ్ ఉండేది ఇక్కడ.
నేను మార్నింగ్ జడ్చర్లకి వెళ్లి నైట్ కి హైదరాబాద్ వచ్చేస్తా. అవసరం ఉన్నప్పుడు నేను అక్కడే ఉంటా. తెలంగాణలో మేము ఎక్కడైనా ఉండొచ్చు. నేను జడ్చర్ల ప్రజలకు అందుబాటులోనే ఉన్నా. పవన్ మాత్రం 400 కిలోమీటర్ల దూరంలో ఉంటున్నారు. ఆయన నటుడు కావొచ్చు, మరొకటి కావొచ్చు. ప్రజలు ఆయనను గెలిపించారు. ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆయన రాజధానిలో ఆయన ఉండాలి. మా మినిస్టర్లు అంతా రాజధానిలో ఉంటారు లేదా వారి వారి నియోజకవర్గాల్లో ఉంటారు. చెన్నైలో, బెంగళూరులో ఉండటం లేదు కదా? అని ప్రశ్నల వర్షం కురిపించారు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి.
