IPL 2026: చెన్నైపై బెంగళూరు ఘన విజయం
తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ విధ్వంసం సృష్టించింది. భారీ స్కోర్ నమోదు చేసింది.
IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. 43 పరుగుల తేడాతో చెన్నైని చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ విధ్వంసం సృష్టించింది. పరుగుల వరద పారించింది. భారీ స్కోర్ నమోదు చేసింది. 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 250 పరుగులు చేసింది. 251 పరుగుల టార్గెత్ తో బరిలోకి దిగిన సీఎస్కే 19.4 ఓవర్లలో 207 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ సీజన్ లో బెంగళూరుకి ఇది వరుసగా రెండో విజయం. కాగా, చెన్నైకి హ్యాట్రిక్ పరాజయం. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచుల్లో చెన్నై ఓటమి చవి చూసింది. పాయింట్స్ టేబుల్ లో బెంగళూరు నెంబర్ 1 ప్లేస్ లో ఉంది. వరుసగా మూడు ఓటములతో చెన్నై అట్టడుగు స్థానంలో ఉంది.
