కేరళ గవర్నమెంట్ డిజిటిల్ క్లాసులకు 141 దేశాల నుంచి స్టూడెంట్స్

దేశంలో విద్యలో కేరళ ఎప్పుడు ముందు వరుసలోనే ఉంటుంది. విద్యకు సంబంధించి కొత్త విధానాలను అవలంభించడం కేరళకు సాటి మరొకటి లేదనే చెప్పాలి. కరోనా వైరస్ వ్యాప్తితో లాక్ డౌన్ విధించడంతో స్కూళ్లు మూతపడ్డాయి. విద్యార్థులకు డిజిటల్ తరుగతులు అందించేందుకు వీలుగా కేరళ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది.. డిజిటల్ లెర్నింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
దీని ద్వారా రాష్ట్రంలో 41లక్షల మంది విద్యార్థులకు విద్యను అందిస్తోంది. కేరళ ప్రభుత్వం ప్రారంభించిన డిజిటల్ తరగతి
‘ఫస్ట్ బెల్’ ప్రోగ్రామ్.. ప్రపంచ స్థాయిలో ఆదరణ పొందింది. కేరళ రాష్ట్రంలో 2.42 లక్షల మంది విద్యార్థులకు వారి ఇళ్లలో టీవీ లేదా ఇంటర్నెట్ సదుపాయం లేదు. తక్కువ వయస్సు గలవారికి డిజిటల్ లెర్నింగ్ సదుపాయాన్ని కల్పించడానికి ఈ కొత్త ప్రొగ్రామ్ అమల్లోకి తీసుకొచ్చింది.
పాఠశాలల్లో ICT విద్య కోసం టీవీ ద్వారా బోధన విద్యార్థులకు ప్రధాన మాధ్యమంగా అందిస్తున్నట్టు రాష్ట్ర నోడల్ ఏజెన్సీ కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నాలజీ ఫర్ ఎడ్యుకేషన్ (KITE) CEO కె అన్వర్ సదాత్ చెప్పారు. కైట్ విక్టర్స్ వెబ్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాంకు అనేక దేశాల నుంచి మంచి స్పందన వస్తోంది.
141 దేశాల నుంచి 442 TB డేటాను ఇంటర్నేషనల్
స్టూడెంట్స్ వినియోగించుకుంటున్నారు. వెబ్-స్ట్రీమింగ్ ద్వారా క్లాసులు చూసినవారిలో 10 శాతం యుఎస్, యూరప్, పశ్చిమ ఆసియా నుంచే ఉన్నారు. కేరళ నుంచి వచ్చిన ప్రవాసులను ఆకట్టుకునేలా ఉంటాయని ఆశిస్తున్నట్టు తెలిపారు. ప్రతిరోజూ తరగతుల వెబ్ స్ట్రీమింగ్‌కు అద్భుతమైన స్పందన వస్తోందన్నారు.
యూట్యూబ్ ఛానెల్‌లో క్రమం తప్పకుండా వీక్షించే వారి సంఖ్య పెరిగిందన్నారు. కేరళ బయట నుంచే ఎక్కువగా వీక్షిస్తున్నట్టు తెలిపారు. యూట్యూబ్‌లో మాత్రమే క్లాసుల సగటు వీక్షకుల సంఖ్య 54 లక్షలుగా ఉందని, రోజుకు 5 లక్ష గంటల వరకు ఉంటుందని చెప్పారు.
కేరళలోని అనేక ప్రాంతాల్లో కోవిడ్ -19 హాట్‌స్పాట్‌లుగా ప్రకటించారు.. వివిధ జిల్లాల నుంచి 2 వేల బేసి హైటెక్ పాఠశాలల సహకారంతో తరగతుల తయారీకి ఏర్పాట్లు చేసినట్లు సదాత్ తెలిపారు. విద్యాసంవత్సరం ప్రారంభమైన జూన్ 1న రాష్ట్రం డిజిటల్ తరగతులను ప్రారంభించింది.
2.42 లక్షల మంది విద్యార్థులకు వారి ఇళ్లలో టీవీ లేదా ఇంటర్నెట్ సదుపాయం లేదు. తక్కువ వయస్సు గలవారికి డిజిటల్ లెర్నింగ్ సదుపాయాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఫస్ట్ బెల్ కార్యక్రమం ద్వారా విద్యా శాఖ పరిధిలోని కైట్ విక్టర్స్ ఇప్పటికే 1,000 తరగతులను ప్రసారం చేసిందని సదాత్ తెలిపారు.