World Photography Day 2023: ఫొటోగ్రాఫర్‌వా? డ్యాన్సర్‌వా? నీ డ్యాన్స్‌ను గనుక డ్యాన్సర్లు చూస్తే..
అదీ మామూలుగా కాదు.. తన పనికి ఆటంకం కలగకుండానే, వీడియో తీస్తూనే స్టెప్పులు వేశాడు.

World Photography Day 2023
World Photography Day 2023 – Hilarious Video : ప్రపంచ ఫొటోగ్రఫీ డే వేళ సామాజిక మాధ్యమాల్లో (Social Media) ఓ ఫొటోగ్రాఫర్ వీడియో తెగ వైరల్ అవుతోంది. అతడు అత్యద్భుత ఫొటో తీసినందుకు కాదు.. అత్యద్భుతంగా డ్యాన్స్ చేసినందుకు. ఓ వేడుకలో ఫొటోలు, వీడియోలు తీసేందుకు ఓ ఫొటోగ్రాఫర్ వచ్చాడు.
వేడుకకు వచ్చిన వారు డ్యాన్స్ చేస్తున్నారు. పంజాబీ బీట్స్‌కు మైమరచిపోయి వారు డ్యాన్స్ చేస్తున్న వేళ ఫొటోగ్రాఫర్ తన పని తాను చేస్తూనే డ్యాన్స్ చేశాడు. అదీ మామూలుగా కాదు.. తన పనికి ఆటంకం కలగకుండానే, వీడియో తీస్తూనే స్టెప్పులు వేశాడు. అతడు వేసిన స్టెప్పులకు అక్కడున్న వారందరూ ఫిదా అయిపోయారు.
ఎవరూ మనల్ని చూడనప్పుడు, ఒంటరిగా ఉన్న సమయంలో ఎలా డ్యాన్స్ చేస్తామో అలా డ్యాన్స్ చేశాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆ ఫొటోగ్రాఫర్ డ్యాన్సర్ కూడా అయి ఉంటాడని కొందరు కామెంట్ చేశారు. మీ వేడుకకు వచ్చిన కెమెరామన్ ఇలా డ్యాన్స్ చేయలేదా? అయితే, అతడికి ఇచ్చిన డబ్బును తిరిగి తీసుకోండి అని కొందరు కామెంట్లు చేశారు. ఇటువంటి ఫొటోగ్రాఫర్ ఉంటే ప్రత్యేకంగా డ్యాన్సర్లను పిలిపించే అవసరం ఉండదు.. ఖర్చులు తగ్గుతాయని కొందరు అంటున్నారు.
if your wedding camera man ain’t doing this …..ask for refund pic.twitter.com/UGOwDdedi5
— Punjabi Touch (@PunjabiTouch) August 14, 2023
Money Plant : మనీ ప్లాంట్ దొంగతనం చేసి ఇంట్లో నాటితే నిజంగా అదృష్టం కలిసి వస్తుందా?