వీళ్లు మారరు : డెత్ సర్టిఫికెట్ కోసం లంచం తీసుకుంటూ దొరికిన రెవెన్యూ అధికారిణి
లంచగొండితనాన్ని నిర్మూలించేందుకు ఏసీబీ అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, అరెస్టులు చేసి కేసులు పెడుతున్నా.. ఫలితం లేకుండా పోతోంది. కొంతమంది రెవెన్యూ

లంచగొండితనాన్ని నిర్మూలించేందుకు ఏసీబీ అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, అరెస్టులు చేసి కేసులు పెడుతున్నా.. ఫలితం లేకుండా పోతోంది. కొంతమంది రెవెన్యూ
లంచగొండితనాన్ని నిర్మూలించేందుకు ఏసీబీ అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, అరెస్టులు చేసి కేసులు పెడుతున్నా.. ఫలితం లేకుండా పోతోంది. కొంతమంది రెవెన్యూ అధికారుల తీరులో మార్పు రావడం లేదు. ఏ పని కావాలన్నా లంచం డిమాండ్ చేస్తున్నారు. చేయి తడపనిదే పని అవ్వదు అంటున్నారు. లంచం ఇవ్వనివారి కాళ్లు అరిగేలా ఆఫీస్ చుట్టూ తిప్పుకుంటున్నారు. తాజాగా రెవెన్యూ ఆఫీస్ లో పని చేసే మరో ఉద్యోగిని లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయింది.
వివరాల్లోకి వెళితే.. డెత్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు ఓ రెవెన్యూ అధికారిణి లంచం డిమాండ్ చేసింది. లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలులో ఈ ఘటన జరిగింది. భీమడోలు గ్రామానికి చెందిన చొప్పిశెట్టి సత్యనారాయణ అనే వ్యక్తి కొద్ది రోజుల క్రితం చనిపోయాడు. డెత్ సర్టిఫికెట్ కోసం మృతుడి భార్య బేబీ.. మీ-సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకుంది. విచారణ కోసం సదరు పత్రాలు భీమడోలు ఆర్‌ఐ సౌజన్యా రాణి కార్యాలయానికి చేరాయి. వీటికోసం బేబీ… ఆర్‌ఐని సంప్రదించగా.. ఆర్‌ఐ రూ.10 వేలు లంచం డిమాండ్ చేసినట్లు బేబీ ఆరోపించారు. లంచం ఇస్తేనే సర్టిఫికెట్ ఇస్తానని తేల్చి చెప్పారట. తాను అంత ఇవ్వలేను అని బేబీ వాపోతే… చివరికి రూ.3వేలు ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నారు.
కాగా, బేబీ.. ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు… బేబీ నుంచి సౌజన్యా రాణి డబ్బు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సొమ్మును స్వాధీనం చేసుకుని కేసు పెట్టారు. పట్టుబడిన తర్వాత ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సౌజన్యా రాణి వెక్కివెక్కి ఏడ్చారు తప్ప సమాధానం మాత్రం చెప్పలేదు. చట్టప్రకారం ఆర్ఐపై చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు తెలిపారు.