కొత్త ఎస్వీబీసీ ఛైర్మన్‌‌గా ఎవరంటే?

  • Published By: vamsi ,Published On : January 13, 2020 / 07:57 AM IST
కొత్త ఎస్వీబీసీ ఛైర్మన్‌‌గా ఎవరంటే?

Updated On : January 13, 2020 / 7:57 AM IST

ధర్టీ ఇయర్స్ పృథ్వీ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఓ నాయకుడు, సినిమాల్లో ఓ కామెడీ నటుడు.. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక సినిమాల్లో గట్టి పాత్రలే చేసిన పృథ్వీకి అనుకోకుండా కలిసి వచ్చిందో.. జగన్ వరం కారణంగా ప్రతిష్టాత్మక ఎస్వీబీసీకి ఛైర్మన్ అయిపోయాడు. అయితే గట్టిగా ఆరు నెలలు కూడా ఆ పదవిలో ఉండలేకపోయాడు. చివరకు పదవి పోయి పరువు పోయి రాజకీయాలకు దూరమయ్యే పరిస్థితికి వచ్చాడు. ఓ ఆడియో టేప్ కారణంగా అతా రెండు రోజుల్లో అతని పరిస్థితి మారిపోయింది. దీంతో తన ఎస్వీబీసీ పదవికి రాజీనామా చేశాడు.

ఇప్పుడు అంత ముఖ్యమైన పదవి ఇప్పుడు ఎవరికి దక్కబోతుంది అనేది ఆసక్తికరమైన విషయంగా మారింది. అయితే ఈ పదవిని పోసానికి అప్పగిస్తారు అని కొందరు మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ పదవిని రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అయిన వ్యక్తికి ఇవ్వాలని నిర్ణయించుకున్నారట. ఈ విషయం ఇప్పుడు వైసీపీ సర్కిళ్లలో వినిపిస్తుంది.

పృథ్వి రాజ్ రాజీనామాతో ఖాళీ అయిన ఈ పదవిని ప్రముఖ దర్శకుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితులు అయన శ్రీనివాస్ రెడ్డికి ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఎస్వీబీసీ ఛైర్మన్‌గా ఈసారి శ్రీనివాస్ రెడ్డిని నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత రెండు రోజులుగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్‌లో జరుగుతున్న వివాదాలపై టిటిడి చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించగా.. ఇందులో కూడా దీనికి సంబంధించి చర్చ జరిగినట్లు చెబుతున్నారు. శ్రీనివాస్ రెడ్డి ఢమరుకం, కుబేరులు, టాటా బిర్లా మధ్యలో లైలా, రాగల 24 గంటలు వంటి సినిమాలు తీశారు.