సర్పంచ్ లే టార్గెట్ : కరీంనగర్‌లో అఘోరాల కలకలం

  • Published By: madhu ,Published On : February 13, 2019 / 07:29 AM IST
సర్పంచ్ లే టార్గెట్ : కరీంనగర్‌లో అఘోరాల కలకలం

Updated On : February 13, 2019 / 7:29 AM IST

కరీంనగర్ : వింతరూపం..ఒళ్లంతా బూడిద…బట్టలు లేకుండా..పెద్ద పెద్ద బొట్లు…ఉన్న ఓ అఘోరా జిల్లాలో హల్ చల్ చేశాడు. ఇతని చూసిన జనాలు భయంతో వణికిపోయారు. వీధుల్లో సంచరిస్తూ అందర్నీ హడలెత్తించాడు. ఈ అఘోరాన్ని సెల్ ఫోన్‌లలో బంధించేందుకు పలువురు ఆసక్తి చూపారు. డబ్బులు వసూలు చేయడానికి వీరు వచ్చారు. ఫిబ్రవరి 13వ తేదీ సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. కొన్ని రోజులుగా అఘోరాలు తిరుగుతున్నారు. ఎలాంటి కీడు వస్తుందోనని జనాలు వణుకుతున్నారు. 

ఉత్తర్ ప్రదేశ్ రిజిస్ట్రేషన్‌తో ఉన్న వాహనంలో ఒకతను బట్టలు లేకుండా.. మరో ఇద్దరు కాషాయ దుస్తులు ధరించి తిరిగారు. రామడుగు, గంగాధర మండలాల్లో వీరు తిరుగుతూ భయాందోళనలకు గురి చేస్తున్నారు. కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లను వీరు టార్గెట్ చేశారు. సర్పంచ్‌‌ ఇళ్లు ఎక్కడా ? అంటూ ఆరా తీస్తున్న వారి నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. వీరి బారిన పడిన కొంతమంది సర్పంచ్‌లు మోసపోయారు. తమ దగ్గరకు వచ్చి మంచి జరగాలంటే డబ్బులు ఇవ్వాలని.. రూ.500 ఇస్తే తీసుకోలేదని..రూ. 3వేలు ఇస్తే వెళ్లారని ఓ సర్పంచ్ చెప్పుకొచ్చాడు. అఘోరాలపై పోలీసులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని జిల్లా వాసులు కోరుతున్నారు.