అసెంబ్లీ సాక్షిగా ఆరోజు జగన్ స్వాగతించారు: చంద్రబాబు

  • Published By: vamsi ,Published On : October 25, 2019 / 01:20 AM IST
అసెంబ్లీ సాక్షిగా ఆరోజు జగన్ స్వాగతించారు: చంద్రబాబు

Updated On : October 25, 2019 / 1:20 AM IST

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ విషయంలో ప్రభుత్వం ఎందుకు కమిటీల పేరుతో ఆలస్యం చేస్తుందంటూ నిలదీశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడిబొడ్డున, నది ఒడ్డున అందరికీ అందుబాటులో ఉండాలని అమరావతిని రాజధానిగా నిర్ణయించాం.

ఇదే జగన్మోహన్ రెడ్డి ఆరోజు ప్రతిపక్ష నేతగా ఉండి అసెంబ్లీ సాక్షిగా స్వాగతిస్తున్నట్లు చెప్పారు. శివరామకృష్ణన్ కమిటీ చేసిన ప్రజాభిప్రాయ సేకరణలో, కమిటీకి వచ్చిన మెయిల్స్ కూడా రాజధానిగా అమరావతి ప్రాంతం అనుకూలంగా ఉందని ధ్రువీకరించాయి.

అయితే ప్రధాని శంకుస్థాపన చేసి నాలుగేళ్లు పూర్తయిన తర్వాత ఇప్పుడు మళ్లీ రాజధాని నిర్ణయంపై కమిటీ వేయడం ఏమిటి?‘‘ హైకోర్టు వద్ద తాగడానికి టీ కూడా లేని పరిస్థితి’’ ఉందంటూ వ్యాఖ్యలు చేయడం మీకు తలవంపులుగా లేవా? వైసీపీ ప్రభుత్వానికి రాజధాని నిర్మించే సత్తా లేదు. ఆ విషయాన్ని ప్రజల ముందు ఒప్పుకునే నిజాయితీ లేదు. అంటూ చంద్రబాబు వైసీపీపై విమర్శలు గుప్పించారు.