amazon కొత్త సర్వీస్ : ఆన్ లైన్ లో అమెజాన్ ఫార్మసీ

  • Published By: nagamani ,Published On : August 15, 2020 / 12:21 PM IST
amazon కొత్త సర్వీస్ : ఆన్ లైన్ లో అమెజాన్ ఫార్మసీ

Updated On : August 15, 2020 / 12:46 PM IST

amazon..ఈ ఆన్ లైన్ మార్కెట్ లో దొరకని వస్తువంటూ లేదు. పిన్నీసునుంచి పీపీఈ కిట్ల వరకూ అన్ని అందుబాటులో లభిస్తాయి. ఇంటిలో కూర్చుని ఒక్క క్లిక్ చేస్తే చాలా నట్టింటిలో వాలిపోతాయి మీకు అవసరమైన వస్తువు. ఒక్కమాటలో చెప్పాలంటే భూమిమీద ఉండే అన్నీ amazon దొరకేస్తాయి.



ఈ లాక్ డౌన్ పరిస్థితుల్లో మరో సదుపాయాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది amazon.ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ లాక్ డౌన్ పరిస్థితుల్లో సరికొత్త నిర్ణయం తీసుకుంది. amazon ఆన్ లైన్ లో మెడిసిన్స్ ను కూడా ఆన్ లైన్ లో విక్రయించనుంది.

అమెజాన్ ఫార్మసీ పేరిట అందించే ఈ సేవలను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది. నోటి మాటతో అడిగి తీసుకునే మందులనే కాకుండా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ పై మాత్రమే లభించే ఔషధాలను కూడా అమెజాన్ తన ఆన్ లైన్ దుకాణంలో అందుబాటులోకి తీసుకురానుంది.



అంతేకాదు, సాధారణ స్థాయి వైద్య పరికరాలు, సంప్రదాయ భారత మూలికా ఔషధాలు కూడా అమెజాన్ ఫార్మసీలో లభించనున్నాయి. భారత్ లో వాల్ మార్ట్ ఆధ్వర్యంలోని ఫ్లిప్ కార్ట్, ముఖేశ్ అంబానీకి చెందిన జియోమార్ట్, మరికొన్ని ఇతర ఈ-కామర్స్ సంస్థల నుంచి ఎదురవుతున్న పోటీ ఎదుర్కొనేందుకు అమెజాన్ తన సేవలను మరింత విస్తరించాలని నిర్ణయించింది. దీంట్లో భాగంగానే.. amazon ఫార్మసీ సేవలను తొలుత బెంగళూరులో అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది.