కారును ఢీకొన్న అంబులెన్స్ : వైద్య విద్యార్థిని మృతి

చిత్తూరు జిల్లాలో సంక్రాంతి పండుగ వేళ విషాదం నెలకొంది. ఆపదలో ఉన్నవారిని ఆదుకునే అంబులెన్స్ ఒకరి ప్రాణం తీసింది.

  • Published By: veegamteam ,Published On : January 14, 2020 / 02:46 AM IST
కారును ఢీకొన్న అంబులెన్స్ : వైద్య విద్యార్థిని మృతి

Updated On : January 14, 2020 / 2:46 AM IST

చిత్తూరు జిల్లాలో సంక్రాంతి పండుగ వేళ విషాదం నెలకొంది. ఆపదలో ఉన్నవారిని ఆదుకునే అంబులెన్స్ ఒకరి ప్రాణం తీసింది.

చిత్తూరు జిల్లాలో సంక్రాంతి పండుగ వేళ విషాదం నెలకొంది. ఆపదలో ఉన్నవారిని ఆదుకునే అంబులెన్స్ ఒకరి ప్రాణం తీసింది. రోడ్డు ప్రమాదంలో వైద్య విద్యార్థిని మృతి చెందారు. కుప్పం-పలమనేరు జాతీయ రహదారిపై కారును అంబులెన్స్ ఢీకొట్టింది. దీంతో కీర్తి అనే వైద్య విద్యార్థిని మృతి చెందింది.

ప్రణవ్ అనే మరో మెడికో విద్యార్థికి తీవ్ర గాయాలు అయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. నైట్ పార్టీకి వెళ్లి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.