ఎన్నికలు 2019  : అధికారులు..బీ రెడీ – ద్వివేదీ

  • Published By: madhu ,Published On : March 9, 2019 / 03:45 PM IST
ఎన్నికలు 2019  : అధికారులు..బీ రెడీ – ద్వివేదీ

లోక్ సభ, శాసనసభల ఎన్నికల నోటిఫికేషన్ ఏ క్షణంలోనైనా ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్రాల సీఈవోలు అలర్ట్ అయ్యారు. తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు బిజీ బిజీ అయిపోయారు. లోక్ సభతో పాటు వివిధ రాష్ట్రాల్లో జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలపై ఎలక్షన్ కమిషన్ దృష్టి పెట్టింది. ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాల్లో పర్యటించి పరిస్థితిని అంచనా వేసింది. మార్చి 11వ తేదీ సోమవారం నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారని ఊహాగానాలు ఎక్కువయ్యాయి. 

దీనితో ఏపీ సీఈవో గోపాలకృష్ణ ద్వివేదీ పలు చర్యలు తీసుకుంటున్నారు. మార్చి 09వ తేదీ శనివారం అన్ని జిల్లాల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల నిర్వాహణ కోసం ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లతో సహా అన్ని ఏర్పాట్లను పూర్తిస్థాయిలో చేసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అన్ని జిల్లాల యంత్రాంగం సిద్ధంగా ఉండాలని, జిల్లా కాల్ సెంటర్‌కు ఇక నుండి జిల్లా రెవెన్యూ అధికారులు నోడల్ అధికారిగా వ్యవహరించాలని సూచించారు. 

2014 లోక్‌సభ ఎన్నికల ప్రకటన 2014 మార్చ్ 5న విడుదలైంది. ఎన్నికలు ఏప్రిల్ 16 నుంచి 5 దశల్లో మే 13 వరకు జరిగాయి. మే 16న ఫలితాలు వెలువడ్డాయి. బీజేపీ అధికారం చేజిక్కించుకుంది. మిగతా సహచర పార్టీలతో కలిసి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బీజేపీకి ఈ ఎన్నికల్లో 282 స్థానాలు లభించాయి.