అర్చకులకు వైఎస్ జగన్ వరం: 12ఏళ్ల కోరిక తీర్చారు

అర్చకుల కోరిక ప్రకారం వంశపారంపర్య హక్కులను కల్పిస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఈ మేరకు జగన్ కీలక నిర్ణయం తీసుకోగా.. దేవాదాయశాఖ జీవోను విడుదల చేసింది. ఎన్నికలకు ముందు పాదయాత్ర సమయంలో తనను కలిసిన అర్చకులకు ఇచ్చిన మాట ప్రకారం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు జగన్. వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయంతో ఇకపై దేవాలయాల్లో వంశపారంపర్య హక్కులు పొందుతారు అర్చకులు.
జగన్ తీసుకున్న ఈ నిర్ణయంపై అర్చక సంఘం హర్షం వ్యక్తం చేస్తుంది. విశాఖ శారదాపీఠాధిపతి స్వరూనంద స్వామి కూడా ఈ నిర్ణయంపై ఆనందం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యను జగన్ పరిష్కరించారని, ఇది చాలా గొప్ప నిర్ణయం అన్నారు స్వరూపానంద. తన నిర్ణయంతో అర్చకుల జీవితాల్లో వెలుగులు నింపారని అన్నారు అర్చకులు.
2007లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అర్చకులకు వంశపారంపర్య చట్టం తీసుకుని రాగా.. పదేళ్లుగా ఆ చట్టం అమలు కావట్లేదు. దీనిపై అర్చక సమాఖ్య ఎన్నోసార్లు ప్రభుత్వానికి మొర పెట్టుకుంది. అయితే దీనిపై ఎవరు కూడా స్పందించలేదు. అయితే జగన్ ఈ విషయాన్ని మేనిఫెస్టోలో కూడా చేర్చారు. ఈ క్రమంలోనే మాటను నిలబెట్టుకొని ఉత్తర్వులు విడుదల చేశారు.