ఒక్క పూట సెలవ్: అన్న క్యాంటీన్ ఉండదు

  • Published By: vamsi ,Published On : March 30, 2019 / 03:43 AM IST
ఒక్క పూట సెలవ్: అన్న క్యాంటీన్ ఉండదు

Updated On : March 30, 2019 / 3:43 AM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా శనివారం రాత్రి అన్న క్యాంటీన్‌లను మూసివేస్తున్నారు. పేదలకు రూ.5 ధరకే భోజనం పెట్టాలనే లక్ష్యంతో ప్రారంభమైన ‘అన్న క్యాంటీన్లు’ నిర్విరామంగా సాగుతున్నాయి. అక్షయపాత్ర ఫౌండేషన్‌‌తో కలిసి ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్‌లను శనివారం రాత్రి ఒక పూట మూసివేస్తున్నట్లు అక్షయపాత్ర ఫౌండేషన్‌ ప్రకటించింది.

ఆర్థిక సంవత్సరానికి చివరి పనిదినం కావడంతో బ్యాంకు లావాదేవీలు ముగించవలసి ఉన్నందున శనివారం రాత్రి క్యాంటీన్లు మూసివేస్తామని ఫౌండేషన్ వెల్లడించింది.ఆదివారం నాడు సాధారణంగానే అన్న క్యాంటీన్‌కు సెలవు ఉంటుంది. దీంతో తిరిగి సోమవారం ఉదయం అల్పాహారంతో క్యాంటీన్లు ప్రారంభించనున్నట్లు ఫౌండేషన్ తెలిపింది. 
Read Also : గుడ్ న్యూస్ : పెద్దమ్మగుడి వద్ద మెట్రో ఆగుతుంది