వైసీపీ ఎమ్మెల్యే రజనీ కారుపై రాళ్లదాడి..గుంటూరులో ఉద్రిక్తత

  • Published By: veegamteam ,Published On : February 21, 2020 / 04:36 AM IST
వైసీపీ ఎమ్మెల్యే రజనీ కారుపై రాళ్లదాడి..గుంటూరులో ఉద్రిక్తత

Updated On : February 21, 2020 / 4:36 AM IST

గుంటూరు  వైసీపీ ఎమ్మెల్యే రజనీ మరిది ప్రయాణిస్తున్న కారుపై కొంతమంది దుండగులు రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో కారు అద్దాలు ధ్వంసం కాగా..రజనీ మరిది గోపినాథ్ కు  స్వల్పంగా గాయాలయ్యాయి. కోటప్పకొండ… కట్టుబడివారిపాలెంలో అర్థరాత్రి 1 గంట సమయంలో ఈ దాడి జరిగినట్లు తెలిసింది. కాగా ఈరోజు శివరాత్రి పండుగ కావటంతో ఎమ్మెల్యే రజనీ మరిది గోపీ. కోటప్పకొండకు వెళ్లి ప్రభలను ఇచ్చి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. 

కాగా..దుండగులు దాడి చేసిన కారులో ఎమ్మెల్యే రజనీ ఉన్నారన్న ఉద్దేశంతో దాడి చేసినట్లుగా సమాచారం. కానీ ఆ కారులో ఎమ్మెల్యే రజనీ లేరు. ఈ విషయం తెలుసుకున్న సదరు దుండగులు ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్న క్రమంలో ఈ విషయం తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు అక్కడకు రావడంతో… ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. సదరు దుండగులపై వైసీపీ కార్యకర్తలు దాడికి దిగారు. రెండు వర్గాల వారికీ స్వల్ప గాయాలైనట్లుగా సమాచారం. దీంతో గుంటూరులో రాజకీయం వేడెక్కటంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 

కాగా..రెండు రోజుల క్రితం రాత్రి సమయంలో ఎమ్మెల్యే రజనీ మరిది గోపీనాథ్ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కారును అడ్డుకున్నారు. దీంతో గోపీనాథ్ కోటప్పగుడికి వెళ్తున్నారనీ తెలిసి ఎంపీ అనుచరులు గోపీనాథ్ కారుపై దాడికి యత్నించినట్లుగా  ప్రచారం జరుగుతోంది.

Read More>> IIT-Madras లేడీస్ వాష్‌రూమ్‌లో కెమెరా పెట్టిన లెక్చరర్