ఏపీ బడ్జెట్ : స్త్రీ శిశు సంక్షేమానికి రూ. 3,408 కోట్లు

అమరావతి : అసెంబ్లీలో మంత్రి యనమల రామకృష్ణుడు 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ను ప్రకటించారు. ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో మొత్తం రూ.2.26.117 కోట్లు కేటాయించగా.. 2018 కంటే 18.38 శాతం పెరిగింది. ఈ క్రమంలో మహిళా, శిశు సంక్షేమ శాఖకు రూ. 3 వేల 408 కోట్లను కేటాయించినట్టు మంత్రి యనమల తెలిపారు. పసుపు- కుంకుమ పథకం కింద రాష్ట్ర మహిళలకు రూ.4 వేల కోట్లు కేటాయించారు.
పసుపు-కుంకుమ కు తొలి దశలోరూ.8.604 కోట్లు ఇచ్చామనీ..దీనిలో భాగంగా ప్రతీ మహిళకు రూ.10వేలు ఇస్తున్నామని తెలిపారు. 20,50,794 మంది మహిళలకు రూ.63,283 కోట్ల బ్యాంకు లింకేజిలు ఉంటాయన్నారు. స్త్రీ నిధి లబ్దిదారుల సంఖ్యను రెట్టింపు చేసి..ఈ రుణాల మొత్తాన్ని ఐదు రెట్లు పెంచామని మంత్రి యనమల తెలిపారు. వృద్ధులు, వితంతువుల పెన్షన్ల నిమిత్తం రూ.10,401.05 కోట్లు కేటాయించామన్నారు.