మీకు తెలియచేస్తున్నా : ఓటు వేయకపోతే ఎందుకు పనిచేయాలి – బాబు

ఓటు వేయకపోతే ఎందుకు పని చేయాలి..మీ కోసం కష్టపడి పనిచేస్తే..ఆదరించరా అంటూ ఏపీ సీఎం చంద్రబాబు నెల్లూరు ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు. 140 నదులను కలుపుతానని..నీళ్లు కావాలా ? వద్దా ? అని ప్రశ్నించారు. ఇచ్చాపురం నుండి తడ వరకు బీచ్ రోడ్డు వేస్తానని బాబు హామీనిచ్చారు. రాష్ట్రంలో రౌడీయిజానికి తావు లేదని..ఇక్కడ చోటు లేదన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బాబు ఏప్రిల్ 02వ తేదీన నెల్లూరు జిల్లాలో పర్యటించారు. ఏర్పాటు చేసిన రోడ్ షోలో పాల్గొన్నారు.
తాను ఇక్కడి నుండే ప్రభాకర్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటిస్తే..అమ్ముడుపోయి పార్టీని మోసం చేశాడని..ఇతను నీచమైన వ్యక్తి అంటూ తెలిపారు. రైతులకు అన్నదాత సుఖీభవ, మహిళలకు పసుపు కుంకుమలాంటి ఎన్నో పథకాలను ప్రభుత్వం ప్రవేశ పెట్టిందన్నారు. పసుపు కుంకుమ పథకం కింద ఇచ్చిన చెక్కులు చెల్లవని చెబుతున్న వైసీపీ ముఖాలే చెల్లవని ఎద్దేవా చేశారు. నెల్లూరు జిల్లాలో పేదలకు సుందరమైన ఇళ్లు కట్టించామని, పట్టణ ప్రాంతాల్లో రూ. 10 లక్షల విలువైన ఇల్లు కట్టించామన్నారు బాబు.
గతంలో టీడీపీ పార్టీకి మూడు సీట్లు వచ్చాయని..తాను ఏమీ అనుకోలేదని..2019లో ప్రజల్లో మార్పు వస్తుందని భావించి రాత్రింబవళ్లు కష్టపడినట్లు తెలిపారు. ప్రజలకు ఎంతో చేశానని..నెల్లూరు వాసులు త్వరలోనే గోదావరి నీళ్లు తాగబోతున్నట్లు వెల్లడించారు. ఓటు వేయకపోతే ఎందుకు పనిచేయాలి ? అని బాబు ప్రశ్నించారు. మోడీ నమ్మక ద్రోహి చేస్తే రాష్ట్రంపై కేసీఆర్ డేగకన్ను వేసినట్లు చెప్పిన బాబు కోడి కత్తి పార్టీకి విలువ ఉందా ? అని తెలిపారు. జగన్ జుట్టు కేసీఆర్..మోడీ చేతుల్లో ఉందని వ్యాఖ్యానించారు.