ప్రోటోకాల్ లేదు : ఏపీ డీజీపీ ఆఫీస్ వెళ్లిన సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం

ఏపీలో పోలింగ్ చివరి దశలో ఉండగా జరిగిన ఓ పరిణామం కలకలం రేపుతోంది. చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం స్వయంగా డీజీపీ ఆఫీస్ కు వెళ్లి ఠాగూర్ తో భేటీ అయ్యారు.

  • Published By: chvmurthy ,Published On : April 11, 2019 / 12:50 PM IST
ప్రోటోకాల్ లేదు : ఏపీ డీజీపీ ఆఫీస్ వెళ్లిన సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం

Updated On : April 11, 2019 / 12:50 PM IST

ఏపీలో పోలింగ్ చివరి దశలో ఉండగా జరిగిన ఓ పరిణామం కలకలం రేపుతోంది. చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం స్వయంగా డీజీపీ ఆఫీస్ కు వెళ్లి ఠాగూర్ తో భేటీ అయ్యారు.

ఏపీలో పోలింగ్ చివరి దశలో ఉండగా జరిగిన ఓ పరిణామం కలకలం రేపుతోంది. చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం స్వయంగా డీజీపీ ఆఫీస్ కు వెళ్లి ఠాగూర్ తో భేటీ అయ్యారు. ప్రొటోకాల్ ప్రకారం అయితే డీజీపీనే.. సీఎస్ దగ్గరకు రావాలి. అందుకు భిన్నంగా ఈ భేటీ జరిగింది. 2 గంటలుపైనే వీరి బేటీ ఉండటం విశేషం. పోలింగ్ ముగిసిన తర్వాత కూడా సీఎస్ అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షించారు.
Read Also : EVMలు బాగా పని చేస్తున్నాయ్.. తప్పుడు వార్తలు నమ్మొద్దు : ఈసీ ద్వివేదీ

ఏపీలో పోలింగ్ తీరు, బూత్ రిగ్గింగ్స్, ఘర్షణలపై ఆరా తీశారు. పోలింగ్ తీరును కూడా సమీక్షించారు సీఎస్. వాస్తవంగా అయితే సీఎస్ ఆదేశాలతో.. డీజీపీ రావాల్సి ఉంటుంది. ఇక్కడ మాత్రం సీఎస్ స్వయంగా డీజీపీ ఆఫీస్ కు వెళ్లటం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. 

ఏపీలో పోలింగ్ సరళితోపాటు శాంతిభద్రతల అంశాన్ని కూడా డీజీపీ ఆఫీస్ లో ఉండి సీఎస్ సమీక్షించటం చర్చనీయాంశం అయ్యింది. ఎక్కడెక్కడ అల్లర్లు జరిగాయి.. ఆందోళనలు జరిగాయి అనే విషయాన్ని డీజీపీ నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. 
Read Also : తలపై లేజర్ లైట్ : రాహుల్ కు ప్రాణహాని..హోంశాఖకు కాంగ్రెస్ లేఖ