సందట్లో సడేమియా : ప్రచారంలో షర్మిళ ఉంగరం చోరీ యత్నం

ఎన్నికల ప్రచారాలు జోరుగా జరుగుతున్నాయి. ఈ ప్రచారాలలో సందట్లో సడేమియాలాగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు.

  • Published By: veegamteam ,Published On : March 31, 2019 / 04:49 AM IST
సందట్లో సడేమియా : ప్రచారంలో షర్మిళ ఉంగరం చోరీ యత్నం

Updated On : March 31, 2019 / 4:49 AM IST

ఎన్నికల ప్రచారాలు జోరుగా జరుగుతున్నాయి. ఈ ప్రచారాలలో సందట్లో సడేమియాలాగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు.

మంగళగిరి:  ఎన్నికల ప్రచారాలు జోరుగా జరుగుతున్నాయి. ఈ ప్రచారాలలో సందట్లో సడేమియాలాగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ప్రచార సభలు, రోడ్ షోలతో అభ్యర్థులు, నేతలు బిజీ అయిపోయారు. ఇక  బహిరంగ సభలు, రోడ్‌ షోలకు భారీగా జన సమీకరణ చేస్తున్నాయి పార్టీలు. ఈ క్రమంలో వైఎస్ జగన్ చెల్లెలు షర్మిల అన్న తరపున ప్రచారంలో పాల్గొన్నారు. 
Read Also : రెస్టారెంట్ బంపర్ ఆఫర్ : ఓటేసిరండి.. 20శాతం డిస్కౌంట్ పొందండి

గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి బస్సు యాత్ర ప్రారంభించిన షర్మిల.. రోడ్‌ షోలతో బిజీ అయ్యారు. శనివారం స్థానికులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఇదే సమయంలో పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలు షర్మిలకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు పోటీపడ్డారు. కార్యకర్తల ఉత్సాహం చూసి ఆమె బస్సులో నుంచే చేయి అందించారు. ఇదే అదనుగా ఓ వ్యక్తి షర్మిల చేతికి ఉన్న ఉంగరాన్ని కొట్టేసేందుకు ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన షర్మిల.. తన చేతిని వెనక్కు లాక్కున్నారు. ఉంగరం కాస్త బిగుతుగా ఉండటంతో వేలు నుంచి రాలేదు. ఈ చోరీ యత్నం మొబైల్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. 

వారం క్రితమే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌కు దండ వేస్తున్నట్లు నటించి మెడలో చైన్.. కేటుగాళ్లు కొట్టేసిన విషయం తెలిసిందే. నేతలూ..ప్రచారానికి వచ్చేవారంతా మీ అభిమానులే కాదు దొంగలు కూడా ఉంటరనే విషయం గమనించండి..
Read Also : మే 23 తర్వాత ఫ్యాన్ ఇంటికి, గ్లాస్ బార్‌‌కి : బాలయ్య సెటైర్