బాబు సొంత ఇలాఖాలో లైంగిక వేధింపులు

  • Published By: madhu ,Published On : January 19, 2019 / 07:15 AM IST
బాబు సొంత ఇలాఖాలో లైంగిక వేధింపులు

Updated On : January 19, 2019 / 7:15 AM IST

చిత్తూరు : సీఎం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పం తహశీల్దార్ ఆఫీసులో లైంగిక వేధింపుల ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. గత కొంతకాలంగా వీఆర్ఏ తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ అటెండర్ భవ్య పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించింది. పోలీసులకు కంప్లైట్ చేసినా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని భవ్య ఆరోపిస్తోంది. 
వీఆర్ఏ ఆనంద్ వేధింపులు…
కుప్పం తహశీల్దార్ కార్యాలయంలో వీఆర్ఏగా ఆనంద్ విధులు నిర్వహిస్తున్నాడు. ఇక్కడ భవ్య అటెండర్‌గా పనిచేస్తోంది. అయితే..లైంగిక వాంఛ తీర్చాలంటూ వేధించడం మొదలు పెట్టాడని భవ్య పేర్కొంటోంది. ఈ వేధింపులు తీవ్రస్థాయిలో ఉన్నాయని…చివరకు తన కుటుంబం ఆత్మహత్య చేసుకొనే వరకు వెళ్లిందని మీడియా ఎదుట వాపోయింది. అయితే..తాను తీవ్ర మనస్థాపానికి..ఆగ్రహానికి గురై..ఆనంద్‌పై చేయి చేసుకొంటే…ఆనంద్..గౌతమిలిద్దరూ తనపై చేయి చేసుకున్నారని వాపోయింది. ఇదంతా ఎమ్మార్వో ఎదుటే జరిగిందన్నారు. అయినా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో తాను కుప్పం పోలీసులను ఆశ్రయించడం జరిగిందని తెలిపింది. ఈ విషయం జిల్లా కలెక్టర్‌కి తెలిసిందని..వెంటనే రెండు గంటల్లోగా నివేదిక అందచేయాలని సంబంధింత అధికారులకు ఆదేశాలు వెళ్లాయని తెలుస్తోంది.