ధర్మపోరాట దీక్ష : ఈమె ఎవరో గుర్తు పట్టండి

  • Published By: madhu ,Published On : February 11, 2019 / 07:26 AM IST
ధర్మపోరాట దీక్ష : ఈమె ఎవరో గుర్తు పట్టండి

Updated On : February 11, 2019 / 7:26 AM IST

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా..రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చాలంటూ దేశ రాజధాని ఢిల్లీలో ఏపీ సీఎం బాబు చేపట్టిన ధర్మపోరాట దీక్షలో ఒకరు హైలెట్‌గా నిలిచారు. తెలుగు తల్లి పాత్రలో వచ్చిన ఆమె అందర్నీ ఆశ్చర్యపరిచింది. చివరకు ఆమె ఎవరో కాదు..టీడీపీ పార్టీలో కీలక నేత అని తెలవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఫిబ్రవరి 11వ తేదీ సోమవారం ఉదయం 8 నుండి రాత్రి 8గంటల వరకు బాబు దీక్షను కొనసాగించనున్నారు. బాబుకు పలువురు జాతీయ నేతలు సంఘీభావం ప్రకటిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ఏపీపై చూపెడుతున్న వివక్షను వారు ఎండగడుతున్నారు. వెంటనే విభజన హామీలు నెరవేర్చాలని…ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. 

బాబు నిర్వహిస్తున్న ధర్మపోరాట దీక్షలో పాల్గొనేందుకు ఏపీ రాష్ట్రం నుండి పలువురు నేతలు భారీగా తరలివచ్చారు. ప్రత్యేక రైళ్ల ద్వారా సుమారు 3వేల మంది కార్యకర్తలకు ఢిల్లీకి చేరుకున్నారు. బాబు చేపట్టిన దీక్ష వద్ద కొంతమంది పలు వేషధారణలు ధరించారు. తెలుగు తల్లి పాత్రలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సాదినేని యామిని శర్మ ‘నా తల్లి భరతమాత సాక్షిగా నా రాష్ట్ర బిడ్డలకు అన్యాయం చేస్తున్న కేంద్రం’ అనే స్లోగన్ ఉన్న ప్ల కార్డును పట్టుకుని వేదికపై నిలబడ్డారు. తెలుగు తల్లిని ప్రతిబింబించేలా ఉన్న యామినిని పలువురు ప్రశంసించారు.