మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ

తెలంగాణ రాష్ట్రమంతా బతుకమ్మ సంబురాలతో అలరారుతోంది. సాయంత్రం అయ్యేసరికి చక్కగా ముస్తాబై..బతుక్మ ఆటపాటలతో సందడి చేస్తున్నారు. రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉండే తెలంగాణ ఆడబిడ్డలంతా బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నారు. ఎంగిలి బతుకమ్మగా ప్రారంభమైన బతుకమ్మ వేడుకలు మూడవరోజు కూడా అంతే ఉత్సాహంగా జరుగుతున్నాయి.
మొదటి రెండురోజులు ఎంగిలిపువ్వు బతుకమ్మ, అటుకుల బతుకమ్మ వేడుకలు ముగిశాయి. సోమవారం (సెప్టెంబర్ 30) మూడవరోజు మూడంతరాలలో చామంతి, మందార, సీతమ్మజడ, రామబాణం పూలతో బతుకమ్మను చేసి.. తామర పాత్రల్లో అందంగా అలంకరిస్తారు. ఈ మూడవరోజున ముద్దపప్పు బతుకమ్మగా పూజిస్తారు.
ముద్దపపపు బతుకమ్మకు ప్రత్యేకంగా ప్రసాదాలను తయారు చేస్తారు ఆడబిడ్డలు. పేరంటాళ్లకు కూడా ప్రత్యేక వాయనాలను ఇస్తారు.మరి అవేంటో చూద్దాం.
మూడవరోజు వాయనం: సత్తుపిండి, పెసర్లు, చక్కర, బెల్లం వాయనంగా పేరంటాళ్లకు పంచి పెట్టుకుంటారు. వాయనాలతో పాటు ఆత్మీయతను కూడా పంచుకుని మురిసిపోతారు ఆడబిడ్డలు.
బతుకమ్మకు నైవేద్యాలు: ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం సమర్పించాలి.
మూడ వరోజు ముద్దపప్పు బతుకమ్మను ఆరాధిస్తే ఆరోగ్యం, బోగభాగ్యాలు లభిస్తాయని నమ్ముతారు తెలంగాణ ఆడబిడ్డలు.