యాక్సిడెంట్ లో ఎస్సై మృతి: కమిషనర్ కంటతడి 

  • Published By: veegamteam ,Published On : March 5, 2019 / 08:04 AM IST
యాక్సిడెంట్ లో ఎస్సై మృతి: కమిషనర్ కంటతడి 

Updated On : March 5, 2019 / 8:04 AM IST

నార్కట్ పల్లి : విధులకు వెళ్లి వస్తుండగా పోచంపల్లి ఎస్సై మధుసూదన్ (35) రోడ్డుప్రమాదంలో మృతి చెందారు. మార్చి 5 తెల్లవారుజామున నార్కట్ పల్లి వద్ద జరిగిన ప్రమాదంలో ఆయన దుర్మరణం పాలయ్యారు. నల్గొండలో బందోబస్తు కారులో వెళ్తుండగా తనే డ్రైవ్ చేస్తున్న ఎస్సై బొలెరో పోలీస్ వాహనం మహాత్మాగాంధీ యూనివర్సిటీ దగ్గర అదుపు తప్పి పల్టీ కొట్టింది.

ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన మధుసూధన్ ను  కామినేని హాస్పిటల్ కు తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ మృతి చెందారు. తిప్పర్తి మండలానికి చెందిన మధుసూదన్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
Also Read : పెళ్లి కూతురు హ్యాండిచ్చింది: పెళ్లి కొడుకు సూసైడ్

మహేష్ భగవత్ కంటతడి
జిల్లా కేంద్ర ఆస్పత్రి మార్చరీలో ఎస్ఐ మధుసూదన్ మృతదేహం చూసి రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేష్ భగవత్ కంట తడిపెట్టారు. అశ్రు నయనాలతో మధుసూదన్ మృతదేహానికి న భగవత్, ఎస్పీ రంగనాధ్, యాదాద్రి డిసిసి రామచంద్రారెడ్డి, పోలీస్ సిబ్బంది నివాళులు అర్పించారు.