సీఎం రమేష్ కుటుంబంలో విషాదం

రాజ్యసభ సభ్యులు, బీజేపీ నేత సీఎం రమేష్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. సీఎం రమేష్ సోదరుడు ప్రకాష్ నాయుడు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. వీరి స్వస్థలం కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి. ప్రకాష్ నాయుడు సీఎం రమేష్‌తో పాటూ రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉండేవారు.
సీఎం రమేష్ టీడీపీలో ఉన్న సమయంలో ప్రకాష్ పార్టీ కార్యక్రమాలను దగ్గరుండి చూసుకునేవారు. కొద్దిరోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రకాష్ మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేశారు.
సీఎం రమేష్ సోదరుడి వయసు 51సంవత్సరాలు. ప్రకాష్ కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. సోమవారం రాత్రి 7.45గంటలకు తుదిశ్వాస విడిచినట్టు కుటుంబసభ్యులు తెలిపారు.