పోలీసుల కళ్లెదుటే బావ గొంతు కోసిన బామర్ది

సూర్యాపేట జిల్లా చివ్వెంల పోలీస్ స్టేషన్ లో దారుణం చోటు చేసుకుంది. బావ గొంతు బామర్ధి గొంతి కోశారు. బామర్ధి రఘు బావ దేవేందర్ గొంతు కోశాడు. దీంతో దేవేందర్ పరిస్థితి విషమించటంతో హుటాహుటిన సమీపంలోని హాస్పిటల్ రు తరలించి చికిత్సనందిస్తున్నారు. సాక్షాత్తు పోలీస్ స్టేషన్ లోనే జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
గత కొంత కాలంలో దేవేందర్ అతని భార్యకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. అదికాస్తా పోలీసు స్టేషన్ కు చేరింది. దీంతో పోలీసులు ఇప్పటికే పలు మార్లు ఇరు కుటుంబాలక కౌన్సెలింగ్ నిర్వహించారు. దీంట్లో భాగంగా మారోసారి కౌన్సెంలింగ్ కు వచ్చిన క్రమంలో పోలీసులు ఇరు కుటుంబాలకు నచ్చచెబుతున్న క్రమంలో బామర్ది రఘు బావ దేవేందర్ పై బ్లేడ్ తో దాడి చేసిన గొంతు కోసేశాడు.
దీంతో గొంతు చాలావరకూ తెగిపోవటంతో తీవ్ర రక్త స్రావం అయింది. దీంతో దేవేందర్ ను వెంటనే సూర్యాపేట హాస్పిటల్ కు తరలించారు. తీవ్ర రక్తస్రావం కావటంతో దేవేందర్ పరిస్థితి విషమంగా ఉందంటున్నారు డాక్టర్లు.