రూ.9కే చీర : మహిళలకు బంపర్ ఆఫర్
కడప : ఓ షాపు ముందు మహిళలు భారీగా క్యూలో నిల్చున్నారు. ఎందుకంటారా చౌకధరలో ఇస్తున్న చీరల కోసం. కడప కోటిరెడ్డి సర్కిల్ లోని ఓ వస్త్ర దుకాణం ప్రారంభించి మూడేళ్లైన సందర్భంగా బంపర్ ఆఫర్ పెట్టింది. కేవలం రూ.9కే చీర అంటూ ప్రకటించి ఆకట్టుకుంది. దీంతో జనవరి 6న ఉదయం నుంచి మహిళలు షాప్ ముందు క్యూ కట్టారు.
5 గంటల నుంచి 10 లోపు ఎంతమంది మహిళలు వస్తే అందరికీ చీరలు ఇస్తామని షోరూమ్ యాజమాన్యం తెలిపింది. దీంతో మహిళలు షాపుకు పోటెత్తారు. భారీగా తరలి వచ్చిన మహిళలతో బట్టల దుకాణం కిక్కిరిసిపోయింది. సందడిగా మారింది. చివరికి పోలీసులను పెట్టి ఇబ్బందులు లేకుండా చూడాల్సి వచ్చింది.