మహేష్ బాబు ఇంటిని తాకిన రాజధాని సెగలు

  • Published By: vamsi ,Published On : January 10, 2020 / 06:53 AM IST
మహేష్ బాబు ఇంటిని తాకిన రాజధాని సెగలు

Updated On : January 10, 2020 / 6:53 AM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అంశం సెగ సినిమా ఇండస్ట్రీకి కూడా తగులుతుంది. ఇప్పటికే సంక్రాంతి సినిమాలను అడ్డుకుంటాం అంటూ చెబుతున్న రాజధాని రైతులకు అండగా విద్యార్ధి జేఏసీ కూడా ముందుకు వస్తుంది. ఈ క్రమంలోనే ఏపీ రాజధాని అంశం రాజకీయ క్షేత్రం నుంచి సినిమా రంగానికి తాకింది.

ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ.. ఏపీ విద్యార్ధి యువజన పోరాట సమితి.. హీరో మహేష్ బాబు ఇంటి ముందు నిరసనలకు దిగారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై ఏపీకి చెందిన సినిమా హీరోలు స్పందించాలనే డిమాండ్‌తో సరిలేరు నీకెవ్వరు సినిమాకు ముందు విద్యార్ధులు మహేష్ బాబు ఇంటిని ముట్టడించారు.

సరిలేరు నీకెవ్వరు సినిమా విడుదల చేస్తున్న క్రమంలో ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతున్నాడు మహేష్ బాబు. అయితే విద్యార్ధుల ఆందోళనల క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై మహేష్ బాబు స్పందిస్తారో లేదో.. చూడాలి.