నకిలీ బంగారంతో మాయ : బామ్మగారికి టోకరా 

  • Published By: veegamteam ,Published On : April 18, 2019 / 11:11 AM IST
నకిలీ బంగారంతో మాయ : బామ్మగారికి టోకరా 

మనం రోడ్డుపై నడిచి వెళ్తుంటే రూపాయి బిళ్ల కనిపిస్తే తీసుకోకుండా వెళ్లం..మన వద్ద వేలు..లక్షలు ఉన్నా సరే రూపాయి బిళ్లను తీసుకునే వెళతాం..అది మానవ నైజం. కానీ ఇటీవలి కాలంలో మోసాలు కూడా ఎన్నో విధాలుగా జరుగుతున్నాయి. జగిత్యాలలో అన్నపూర్ణ చౌరస్తా వద్ద ఇటువంటి మరోమోసం బైటపడింది. 

జగిత్యాలకు చెందిన వద్ధురాలు నర్మమ్మతో ఇద్దరు మహిళలు మాటలు కలిపారు. తరువాత బామ్మగారూ రోడ్డుపై మాకు బంగారం దొరికింది దాన్ని మనం ముగ్గురం పంచుకుందాం అంటు నమ్మించారు. వారి మాటలు నమ్మి..బంగారం వస్తుందనే ఆశతో వారి వెంట వెళ్లింది. తరువాత వారిద్దరు బామ్మగారూ..ఈ దొరికిన బంగారం అంతా మీరే తీసేసుకోండి. దానికి బదులుగా మీ మెడలో ఉన్న పుస్తెల తాడు ఇచ్చే మేమిద్దరం సర్ధుకుంటాం అన్నారు. తన మెడలోఉన్నది రెండు తులాలే కాబట్టి..వారిచ్చేది దాదాపు 10 తులాల వరకూ ఉందనీ అలాగేనని నర్సమ్మ వారికి తన మెడలో ఉన్న పుస్తెల తాడు తీసి ఇచ్చేసింది. తరువాత ఇంటికి వెళ్లారు దాన్ని పరీక్షించగా అది నకిలీదని తేలింది. దీంతో లబో దిబోమన్న నర్సమ్మ పోలీసుల వద్దకెళ్లి తన గోడు వెళ్లబోసుకుంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సదరు మాయ లేడీల కోసం గాలిస్తున్నారు.