మెడకు ఆరువరుసల బొడ్డుతాడును జయించి పుట్టిన బుడ్డోడు

  • Published By: nagamani ,Published On : August 6, 2020 / 11:07 AM IST
మెడకు ఆరువరుసల బొడ్డుతాడును జయించి పుట్టిన బుడ్డోడు

Updated On : August 6, 2020 / 11:31 AM IST

ప్రసవం తల్లికి పునర్జన్మలాంటిది. కానీ అమ్మ కడుపులో రూపుదిద్దుకున్న శిశువు ఈ లోకంలోకి సురక్షితంగా చేరటానికి చాలానే పోరాడుతుంది. అమ్మకు పురిటినొప్పులు కలిగిస్తూనే..తాను బైటప్రపంచంలోకి రావటానికి ఎంతగానో యత్నిస్తుంది. అటువంటి సమయంలో బిడ్డకు కూడా ప్రమాదం జరిగే అవకాశాలున్నాయి. బిడ్డ అడ్డం తిరగటం..బొడ్డుతాడే బిడ్డ మెడకు చుట్టుకుని పసిగుడ్డు ప్రాణానికే ప్రమాదంగా మారటం వంటివి జరుగుతుంటాయి.



చైనాలో ఓ పసిగుడ్డు పరిస్థితి అలాగే మారింది. ప్రసవం సమయంలో బొడ్డుతాడే ఉరితాడుగా మారింది. ప్రసవ సమయంలో అలా ఒకటీ రెండు సార్లు కాదు ఏకంగా పసిగుడ్డు మెడకు బొడ్డుతాడు ఆరువరసలు చుట్టుకుంది..!కానీ డాక్టర్ల చాకచక్యంతో అత్యంత జాగ్రత్తతో అదృష్టవశాత్తూ పసిగుడ్డుకు ముప్పు తప్పింది. సహజ ప్రసవంలో పుట్టిన ఈ బుడ్డోడు 35 అంగుళాల ఆ బొడ్డుతాడు మెడకు ఆరువరుసలుగా చుట్టుకోగా దాన్ని జయించి అమ్మ బొజ్జలోంచి పుట్టేశాడు. డాక్టర్లను..అమ్మను అంత బాధపెట్టి..తాను కూడా బాధపడి కష్టపడి..ఎట్టకేలకు సురక్షితంగా 6.6 పౌండ్ల బరువుతో జన్మించి ఎంచక్కా ఏమీ ఎరగనట్టు నిద్రలో బోసినవ్వులు నవ్వుతున్నాడీ బుడ్డోడు.



హుబీ రాష్ట్రానికి చెందిన ఏళ్ల మహిళ ప్రసవంలో కోసం ఆస్పత్రికి వెళ్లింది. నార్మల్ డెలివరీ చేస్తుండగా బొడ్డుతాడు సాధారణ బొడ్డుతాళ్లకంటే ఎక్కువ పొడవుగా కనిపించింది. పసివాడి మెడుకు ఆరు వరసలుగా చుట్టుకుని ఉంది. డాక్టర్లు అతి జాగ్రత్తగా వాటిని జాగ్రత్తగా విడదీసి ప్రసవం చేశారు. కానీ ఆ సమయంలో ఏమాత్రం పొరపాటు జరిగినా బిడ్డ ప్రాణం పోయేది కానీ డాక్టర్లు అత్యంత జాగ్రత్తగా చాకచక్యంతో వ్యవహరించటంతో ప్రమాదం ఏమీ జరగకుండా బిడ్డ సురక్షితంగా బైటపడ్డాడు.



ఈ డెలివరీపై ప్రసవం చేసిన డాక్టర్లు మాట్లాడుతూ..తమ ఇన్నేళ్ల సర్వీసులో ఇటువంటి కేసునెప్పుడూ చూడలేదని చెప్పారు. డెలివరీకి ముందు స్కాన్ చేసినప్పుడు మెడకు తాడు ఒకవరసే చుట్టుకున్నట్టు కనిపించిచడంతో పెద్ద సమస్య ఉండదని అనుకున్నాం. కానీ బిడ్డ తల్లి కడుపులో మెలికలుమెలికలు తిరిగేసరికి ఆ బొడ్డుతాడు బిడ్డ మెడకు ఆరు వరసలుగా చుట్టుకుపోయిందని ఈ ప్రసవం సురక్షితంగా జరగాలి భగవంతుడా అనుకుంటూ అతి జాగ్రత్తగా ప్రసవం చేశామని తల్లీ బిడ్డా క్షేమంగా ఉండటం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.