8 నెలల్లో కుప్పానికి ఎయిర్ పోర్ట్

  • Published By: veegamteam ,Published On : January 3, 2019 / 09:25 AM IST
8 నెలల్లో కుప్పానికి ఎయిర్ పోర్ట్

Updated On : January 3, 2019 / 9:25 AM IST

చిత్తూరు  : కుప్పంలో ఎయిర్‌ పోర్టు నిర్మాణానికి  శాంతిపురం మండలం అమ్మవారి పేట వద్ద సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ  సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతు..ఎనిమిది నెలల్లో ఎయిర్‌ పోర్టు పూర్తి చేస్తామని, 100కోట్ల రూపాయలతో విమానాశ్రయం నిర్మిస్తున్నామన్నారు బాబు. మొత్తం 483 ఎకరాల్లో ఎయిర్‌ స్ట్రిప్‌ రానుంది.. రైతులకు నష్టపరిహారంగా ఇప్పటికే 22 కోట్లు చెల్లిస్తున్నామని బాబు తెలిపారు.

కుప్పం ప్రాంతాన్ని ఉద్యానవన పంటలకు హబ్ గా మారుస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని.. బిందు సేద్యం, తుంపర్ల సేద్యం కోసం తాను ఇజ్రాయెల్ టెక్నాలజీ తీసుకొచ్చామని..తక్కువ ఎరువు, నీటితో మంచి దిగుబడి వస్తోందన్నారు. అలాగే ప్రకృతి సేద్యాన్ని కూడా ఏపీ పాటిస్తోందన్నారు. వ్యవసాయంతో పాటు గొర్రెలు, కోళ్లతో పాటు డెయిరీపై రైతులు దృష్టి పెట్టాలని సూచించారు. నాగరికతకు మారుపేరు విమానాశ్రయమని అన్నారు.  కుప్పంతో పాటు త్వరలోనే నెల్లూరు, కర్నూలులో ఎయిర్ పోర్టు రాబోతోందని  చంద్రబాబు తెలిపారు. 

యువత వలసపోకుండా ఇక్కడే ఉద్యోగాలు చేసుకునేలా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు భరోసా ఇచ్చారు.కేవలం ఇక్కడి యువతే కాకుండా బయటి ప్రాంతాలకు చెందిన యువతీయువకులు సైతం ఇక్కడకు వచ్చి పనిచేసుకునేలా కుప్పం ప్రాంతాన్ని తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు తెలిపారు.