మేడిన్ ఆంధ్రా కియా కార్ : చంద్రబాబు

అనంతపురం : జిల్లాలోని పెనుగొండ మండలం ఎర్రమంచిలో దక్షిణ కొరియా కంపెనీ తయారు చేసిన తొలి కియా కారును సీఎంచంద్రబాబు లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు..మేడిన్ ఆంధ్రా కారుగా ఈ కియా కారు నిలిచిపోతుందని చంద్రబాబు పేర్కొన్నారు. కొరియా పెట్టుబడులకు ఏపీని అత్యుత్తమ ప్రదేశంగా తీర్చిదిద్దుతామన్నారు. సౌత్ కొరియాకు, ఆంధ్రప్రదేశ్ కు చాలా దగ్గర పోలికలున్నాయనీ..క్రియేటివిటీ, డైనమిజంలో దక్షిణ కొరియా చాలా అభివృద్దిలో కొనసాగుతోందనీ..ఏపీ ప్రజలకు కూడా అదే డైనమింజంలో కష్టపడి పనిచేస్తున్నారనీ..భవిష్యత్తులో సౌత్ కొరియాతో ఏపీ పోటీ పడుతుందన్నారు.
కియా కంపెనీ ఏర్పాటు ద్వారా 4 వేల మందికి ప్రత్యక్ష్యంగాను..13 వేల మందికి పరోక్షంగాను ఉపాధి లభిస్తుందన్నారు. అతి తక్కువ సమయంలోనే కియా కారు తయారు కావాటం మార్కెట్ లోకి రావటం సంతోషంగా వుందన్నారు. సులభతరం వ్యాపారాన్ని డెవలప్ చేయటంలో ఏపీ ఫష్ట్ ప్లేస్ లో వుందని చంద్రబాబు తెలిపారు. ఈ కియా కంపెనీలో స్థానికులైన అనంతపురం వాసులకు 84 శాతం..రాష్ట్ర ప్రజలకు 64 శాతం ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. రాళ్ల సీమగా పేరున్న అనంతపురాన్ని అభివృద్ధి సీమగా మారేలా నేటి పరిస్థితులున్నాయనీ..ఈ క్రమంలోనే రాయలసీమలో పలు కంపెనీలు రానున్నాయని..రతనాల సీమగా మారే అవకాశముంటుందని..దానికి ప్రత్యక్షంగా కియా కార్ల్ కంపెనీ మొదటి అడుగు అని చంద్రబాబు అన్నారు. భవిష్యత్తులో కియా మోటార్స్ కంపెనీ భారత్ లో అతి పెద్ద మార్కెట్ గా ఆవిర్భవించబోతోందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తంచేశారు.
సుమారు 650 ఎకరాల విస్తీర్ణంలో రూ. 13 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో కియా సంస్థ ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి కియా మోటర్స్ ప్రెసిడెంట్..సీఈవో హెచ్ డబ్ల్యూ పార్క్, భారత కొరియా రాయబారి షిన్ బొంకిల్ హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతోనే తాము రెండున్నరేళ్ల వ్యవధిలో ప్లాంటు, అసెంబ్లీ లైన్ ను నిర్మించి తొలి కారును తయారు చేయగలిగామని సంస్థ చీఫ్ పార్క్ వ్యాఖ్యానించారు.