మాజీ మంత్రి కుమారుడి పెళ్లిలో సీఎం జగన్

  • Published By: vamsi ,Published On : October 3, 2019 / 08:56 AM IST
మాజీ మంత్రి కుమారుడి పెళ్లిలో సీఎం జగన్

Updated On : October 3, 2019 / 8:56 AM IST

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్.. కేంద్ర మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు కిల్లి కృపారాణి కుమారుడి వివాహానికి హాజరయ్యారు.

విశాఖపట్నంలో వీరి పెళ్లి వేడుక ఘనంగా జరగగా ఆ వేడుకకు హాజరయ్యారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌. పెళ్లి వేడుకకు హాజరైన జగన్ నూతన వధూవరులు క్రాంతికుమార్‌, అలేఖ్యలను ఆశీర్వదించారు.

ఈ వేడుకకు ముఖ్యమంత్రితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ హాజరయ్యారు.

అలాగే రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర‍్మాన కృష్ణదాసు, వైఎస్సార్‌ శ్రీకాకుళం జిల్లా నాయకులు పిరియా సాయిరాజ్‌, పేరాడ తిలక్‌ వివాహానికి హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు.