మరోసారి ఢిల్లీకి జగన్

ఇటీవల ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీని కలిసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ(14 ఫిబ్రవరి 2020) మరోసారి ఢిల్లీకి వెళుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి జగన్ ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. సాయంత్రం 6 గంటలకు ఢిల్లీకి చేరుకుని అక్కడ పలువురు కేంద్ర మంత్రులను కలిసుకుంటారు.
ఢిల్లీ పర్యటన అనంతరం శనివారం మధ్యాహ్నానికి సీఎం జగన్ తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. ఈ నెల 12న జగన్ ప్రధాని మోడీని కలిసి రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను వివరించి చేయూత ఇవ్వాలని కోరిన జగన్.. ఇప్పుడు హోం మంత్రి అమిత్ షాతో పాటు న్యాయశాఖ మంత్రులను కూడా కలవనున్నారు.
బుధవారమే ఢిల్లీలో వీరిని కలవాలని ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ కోరినా కూడా అప్పుడు వారి అపాయింట్ మెంట్ దొరక్కపోవడంతో జగన్ వెనక్కి వచ్చేశారు. ఇప్పుడు మరోసారి జగన్ ఢిల్లీకి వెళ్తున్నారు.
Click Here>>డేంజర్ బెల్స్.. ఒక్కసారిగా 50వేల మందికి కరోనా వైరస్