కాయ్ రాజా కాయ్: కోడి పందాలతో తెలంగాణా పల్లెలు

  • Published By: chvmurthy ,Published On : January 13, 2019 / 09:57 AM IST
కాయ్ రాజా కాయ్: కోడి పందాలతో తెలంగాణా పల్లెలు

Updated On : January 13, 2019 / 9:57 AM IST

హైదరాబాద్: పల్లెల్లో పండగ సీజన్ మొదలైంది. డూడూ బసవన్నలు, హరిదాసులు ఊరూరూ తిరిగి సందడి చేస్తున్నారు. ఇంటిముందు తీర్చిదిద్దిన రంగ వల్లులతో ప్రతి పల్లె కలర్ ఫుల్ గా కనపడుతోంది. సంక్రాంతి పండుగ స్పెషల్ కోడి పందాలు కూడా పల్లెల్లో జోరందుకున్నాయి. ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ లోని ఉభయ గోదావరి జిల్లాల్లో కనపడే కోడి పందాలు ఈసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాలలో కనపడుతున్నాయి.  
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మారుమూల గ్రామాలలో కోడి పందాలు జోరందుకున్నాయి. కౌటాల, బెజ్జూర్‌, చింతలమానేపల్లి మండలాలలో కోడి పందాలు వాతావరణం ఏర్పడింది.
ఆదివారం కౌటాల మండలం మొగడుదగడు గ్రామంలో జోరుగా కోడి పందాల ఆట జరుగుతోంది.  గ్రామస్తులు గ్రామ శివారులో గుమిగూడి పందాలు కాస్తున్నారు. సంక్రాంతి పండుగతో పాటు ఆదివారం కావడంతో ఈ కోడి పందాలను నిర్వహిస్తున్నారు, వివిధ గ్రామాల నుండి  గ్రామస్తులు వచ్చి బెట్టింగ్ లు కాస్తూ  హోరెత్తిస్తున్నారు. భారీ బెట్టింగుల మధ్య హోరాహోరీగా పోటీలు నడుస్తున్నాయి. పందేలు జరుగుతున్న ప్రాంతాలు సందడిగా కనిపిస్తున్నాయి.