వివేకాను జగన్ కొట్టేవాడు అందరికీ తెలుసు…సింపతీ కోసం జగన్ డ్రామాలు 

  • Published By: veegamteam ,Published On : March 17, 2019 / 04:41 AM IST
వివేకాను జగన్ కొట్టేవాడు అందరికీ తెలుసు…సింపతీ కోసం జగన్ డ్రామాలు 

Updated On : March 17, 2019 / 4:41 AM IST

తూర్పుగోదావరి : మాజీ ఎంపీ..వైఎస్ జగన్ బాబాయ్ అయిన వైఎస్ వివేకానంద రెడ్డి మృతిపై పలు వివాదాలు తలెత్తుతున్న క్రమంలో కాంగ్రెస్ మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ గతంలో వివేకాపై రెండు సార్లు చేయి చేసుకున్నారనీ..ఈ సంగతి తనతో పాటు ఆ సమయంలో ఉన్న ఎంపీలందరికీ తెలుసునని హర్షకుమార్ తెలిపారు. వివేకా మరణాన్ని జగన్ సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. గతంలో వైఎస్ మరణించిన సమయంలోనూ జగన్ తండ్రి మరణాన్ని కూడా రాజకీయం చేసి సింపతీ కోసం యత్నించారనీ అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ తెలిపారు.
 

2006లో వైఎస్ వివేకానందరెడ్డి రాజీనామా సమయంలో జగన్.. వివేకాను కొట్టారని అన్నారు. కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ సమావేశాల సమయంలో రాజంపేట ఎంపీ సాయిప్రకాష్  కు ఫోన్ వచ్చిందని, ఆ వెంటనే వివేకా రాజీనామా చేసి విమానాశ్రయానికి వెళుతున్నారని, సోనియా ఆదేశాల మేరకు ఆయన్ను తీసుకు వచ్చేందుకు వెళుతున్నానని సాయి ప్రకాష్ అన్నారని గుర్తు చేసుకున్నారు హర్షకుమార్.  సోనియా వివేకాను  పిలిపించుకుని.. రాజీనామాకు కారణం అడిగితే..తనను రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ..జగన్ రెండుసార్లు కొట్టాడని వివేకాయే స్వయంగా చెప్పాడని తెలిపారు. 

దీంతో ఆగ్రహానికి గురైన సోనియా.. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి  ఫోన్ చేసి..కుమారుడిని అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించగా.. ఆయన క్షమాపణలు కూడా  చెప్పారని..ఆ తరువాతనే 2009లో జగన్ ఎంపీ అయ్యారని ఈ విషయాలన్నీ ఆనాడు ఉన్న ఎంపీలకు తెలుసున్నారు. ఇదే విషయాన్ని తన ఫేస్ బుక్ ఖాతాలో హర్షకుమార్ పోస్ట్ చేశారు.

congress