దగ్గుబాటి పురంధేశ్వరీ పార్టీ మారరు – భర్త దగ్గుబాటి

హైదరాబాద్ : దగ్గుబాటి పురంధేశ్వరీ పొలిటికల్ భవిష్యత్‌పై భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పురంధేశ్వరీ పార్టీ మారాల్సి వస్తే..మాత్రం రాజకీయాల నుండి విశ్రాంతి తీసుకుంటారని వెల్లడించడం ప్రాధాన్యత సంతరించుకుంది. జనవరి 27వ తేదీ ఆదివారం మధ్యాహ్నం జగన్ ఇంట్లో దగ్గబాటి వెంకటేశ్వరరావు, ఆయన తనయుడు హితేశ్ చెంచురాంలు ప్రత్యక్షం కావడం ఏపీ రాజకీయ వర్గాల్లో కాక పుట్టించింది. సుమారు ఈ సమావేశం అరగంటకు పైగా కొనసాగింది. అనంతరం దగ్గుబాటి మీడియాతో మాట్లాడుతూ…
జగన్‌తో పయనించడానికి హితేశ్ నిర్ణయించుకున్నారని..దీనిపై జగన్‌తో చర్చించడం జరిగిందన్నారు. పర్చూరు టికెట్‌పై మాత్రం ఆయన స్పందించలేదు. పార్టీ ఏదీ నిర్ణయిస్తే అలా నడుచుకుంటామంటూ అందరిలాగే మాట్లాడారు. ఇక తన సతీమణి పురంధేశ్వరీ పొలిటికల్ కంటిన్యూపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె ప్రస్తుతం బీజేపీలో ఉన్నారని…ఎవరి ఇష్టాలు ఎలా ఉంటే నడుచుకోవచ్చన్నారు. పార్టీ మారాల్సి వస్తే మాత్రం రాజకీయంగా పురంధేశ్వరీ విశ్రాంతి తీసుకుంటారని ప్రకటించారు. రాష్ట్ర ప్రజలకు మేలు చేసేందుకు జగన్ పనిచేస్తున్నారని..అందుకు కృషి చేస్తున్నారని దగ్గుబాటి కొనియాడడం విశేషం. ఎప్పుడు పార్టీలో చేరుతారనే దానిపై స్పష్టంగా చెప్పలేదు.