పెంపుడు కుక్క చనిపోయిన రోజు : వీధి కుక్కలకు బిర్యానీతో విందు

  • Published By: veegamteam ,Published On : January 9, 2020 / 11:17 AM IST
పెంపుడు కుక్క చనిపోయిన రోజు : వీధి కుక్కలకు బిర్యానీతో విందు

Updated On : January 9, 2020 / 11:17 AM IST

మనుష్యులు పుట్టినరోజులు జరుపుకుంటారు. వారి చనిపోతే వారి కుటుంబసభ్యలు వర్థంతులు జరుపుతారు. ఆరోజున బంధువులకు భోజనాలు పెడతారు. ఇది మన సంప్రదాయం. కానీ తాము ఎంతో ప్రేమగా..ఇంటిలో వ్యక్తిలా పెంచుకున్న కుక్క చనిపోయింది. ఆ ఇంటివారంతా ఎంతో బాధ పడ్డారు. అలా సంవత్సరం గడిపోయింది. వర్థంతి వచ్చింది. పెంపుడు కుక్క వర్థంతి రోజు వీధికుక్కలకు బిర్యానీలు పెట్టారు వారు. 

వివరాల్లోకి వెళితే..చిత్తూరు జిల్లా రేణిగుంటకు చెందిన షేక్ ఫరీద్ బాబా ఓ కుక్కను పెంచుకున్నారు.దాని పేరు స్నూపీ. స్నూపీ అంటే బాబా కుంటుంబానికి పంచప్రాణాలు. ఎంతో ప్రేమగా చూసుకునేవారు. స్నూపీతో వారికి 13 ఏళ్ల అనుబంధం ఉంది. ఎంతో అపురూపంగా చూసుకొనే స్నూపీ సంవత్సరం క్రితం చనిపోయింది. అంటే 2019 జనవరి 9న చనిపోయింది. ఆరోజు ఆ ఇంట్లో బాధతో  ఎవరూ భోజనం చేయలేదు. ఆ మూగజీవి పట్ల వారికున్న మమకారమెంతో ఊహించుకోవచ్చు. ఆ రోజు నుంచి స్నూపీ ప్రతీ సందర్భంలోనే గుర్తు చేసుకుంటునే ఉన్నారు. 
అలా సంవత్సరం గడిచిపోయింది. జనవరి 9 వచ్చింది. అదే స్నూపీ తొలి వర్ధంతి. బాబా కుటుంబం అంతా ఉదయమే స్నూపీ సమాధి వద్దకు వెళ్లి ఘనంగా నివాళులు అర్పించారు. పుష్పాంజలి ఘటించారు. ఆ తర్వాత చుట్టుపక్కల వీధివీధి తిరుగుతూ కుక్కలకు బిర్యానీ పెట్టారు. 

ఈ సందర్భంగా ఫరీద్ బాబా మాట్లాడుతూ..ఇదేంటీ ఓ కుక్కపై మరీ ఇంత ప్రేమ ఇది పిచ్చి అనుకోవచ్చు. కానీ స్నూపీని ఎప్పుడూ తాము ఓ జంతువులా చూడలేదనీ..స్వంత మనిషిలా చూసుకున్నామని తెలిపారు. మానవత్వం అటే మనుషులను ప్రేమించడం మాత్రమే కాదని, సృష్టిలో ప్రతి జీవిని ప్రేమించడంగానే తాను భావిస్తానని ఆయన అన్నారు. తన శక్తిమేరకు ఆ దేవుడు అనుగ్రహించిన దానిలో.. అల్లా ఆజ్ఞ మేరకు ఎంతో కొంత సాయం చేస్తానని తెలిపారు. స్నూపీతో ఉన్న అనుబంధం మాటల్లో చెప్పలేనిదనీ..ఈ రోజు దాని పేరుపై అన్నదానం చేస్తే.. స్నూపీ ఆత్మ సంతోషిస్తుందన్న నమ్మకంతో ఈ మూగజీవాల కడుపునింపే ప్రయత్నం చేశామన్నారు.