తప్పిన ప్రమాదం..డీసీఎం వ్యాన్ కు మంటలు

కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం కోమటిపల్లిలో గ్రామంలో సోమవారం(జనవరి 28,2019) పెను ప్రమాదం తప్పింది. గడ్డి లోడుతో వెళ్తున్న డిసిఎం కు కరెంటు వైర్లు తగలడంతో మంటలు చలరేగాయి. దీంతో వెంటనే డ్రైవర్ చాకచక్యంతో డీసీఎంను పక్కనే ఉన్న చెరువులోకి తీసుకు వెళ్లాడు. అక్కడి గ్రామస్తుల సహాయంతో మంటలను ఆర్పివేసారు.
ఆ గ్రామంలో కరెంట్ తీగలు కిందికి ఉండటం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని అక్కడి స్థానికులు చెబుతున్నారు. డ్రైవర్ సమయ స్పూర్తితో నడపడం వల్ల ప్రమాదం ఎం జరగలేదు.