దిశ హత్య కేసు : మహబూబ్ నగర్ జిల్లాలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు
దిశ హత్య కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మహబూబ్ నగర్ జిల్లా కోర్టులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

దిశ హత్య కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మహబూబ్ నగర్ జిల్లా కోర్టులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్య కేసు విచారణ మరింత వేగవంతం కానుంది. దిశ హత్య కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మహబూబ్ నగర్ జిల్లా కోర్టులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతకముందు దిశ హత్య కేసులో విచారణను త్వరగా పూర్తి చేయించి, దోషులకు కఠిన శిక్షలు వేయించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం హైకోర్టుకు లేఖ రాసింది.
దిశ హత్యాచారం కేసులో నిందితులను వెంటనే ఉరి తీయాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీంతో వీలైనంత త్వరగా విచారణ జరిపేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఫాస్ట్ ట్రాక్ ఏర్పాటుకి పర్మిషన్ కోరుతూ హైకోర్టుకి లేఖ రాసింది. ప్రభుత్వ విజ్ఞప్తికి హైకోర్టు సానుకూలంగా స్పందించింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా దిశ హత్య, అత్యాచారం కేసు విచారణ జరుగనుంది.
మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ కోర్టు సెషన్స్ జడ్జి నేతృత్వంలో ఫాస్ట్ టాక్ కోర్టు ఏర్పాటైంది. దీంతో దిశ కేసు విచారణ వేగవంతం కానుంది. వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేసి నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తారు. మరోవైపు దిశ హత్య కేసు నిందితుల పిటిషన్ పై హైకోర్టులో విచారణ కొనసాగుతుంది. నిందితులను కస్టడీకి అప్పగిస్తూ షాద్ నగర్ కోర్టు ఆదేశాలు ఇవ్వగానే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకోనున్నారు. వారిని విచారించేందుకు పోలీసులు ఏర్పాట్లు సిద్ధం చేశారు.