సెప్టెంబర్ నుంచి అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బులు పంపిణీ
సెప్టెంబర్ నుంచి అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బులు ఇస్తామని ఏపీ సీఎం జగన్ తెలిపారు. అగ్రిగోల్డ్, రైతు భరోసాపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.

సెప్టెంబర్ నుంచి అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బులు ఇస్తామని ఏపీ సీఎం జగన్ తెలిపారు. అగ్రిగోల్డ్, రైతు భరోసాపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.
సెప్టెంబర్ నుంచి అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బులు ఇస్తామని ఏపీ సీఎం జగన్ తెలిపారు. ఈమేరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. అగ్రిగోల్డ్, రైతు భరోసాపై అధికారులతో మంగళవారం (ఆగస్టు 27, 2019) సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం నుంచి రూ.1150 కోట్లు ఇస్తామని చెప్పినట్లు తెలిపారు. అగ్రిగోల్డ్ యజమానుల ఆస్తులను ప్రభుత్వం తీసుకొని, తర్వాత వేలం ద్వారా సొమ్మును రికవరీ చేస్తామన్నారు. మిగిలిన డబ్బులన్నింటినీ కూడా బాధితులకు ఇస్తామని చెప్పారు. బాధితులకు మంచి చేయడానికి ఆలస్యం కాకుండా ప్రతి నెల చెల్లింపులు చేయమని ఆర్థికశాఖ కార్యదర్శికి ఆదేశాలు ఇచ్చానని తెలిపారు. సీఐడీ నుంచి అగ్రిగోల్డ్ బాధితుల జాబితా తీసుకోవాలని అధికారులకు సూచించారు. గ్రామ వాలంటీర్ల ద్వారా అగ్రిగోల్డ్ బాధితులకు రశీదులు ఇవ్వాలన్నారు.
2019, అక్టోబరు 15 వ తేదీన రైతు భరోసా పథకం ప్రారంభం కానుందని సీఎం జగన్ తెలిపారు. రైతు భరోసా కౌలు రైతులకూ ఇస్తామన్నారు. రైతు భరోసాపై కౌలు రైతులకు అవగాహన కల్పించాలన్నారు. దీనిపై రైతులు, కౌలు రైతులను ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత గ్రామ వాలంటీర్లదన్నారు. కౌలు పత్రం, కార్డు అన్నీ కూడా సచివాలయంలో అందుబాటులో ఉంటాయన్నారు. రైతులకు నష్టం లేకుండా ఎలాంటి మేలు జరుగుతుందన్న విషయాన్ని కూడా స్పష్టంగా వివరించాలని తెలిపారు.
రబీకి పంటలకు సంబంధించే విధంగా రైతు భరోసా ఉంటుందన్నారు. అదే విధంగా 2019, డిసెంబర్ 21వ తేదీన మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.24వేలు ఇస్తామని ఎన్నికల ప్రణాళికలో చెప్పామని… మగ్గమున్న ప్రతీ చేనేత కుటుంబానికి రూ.24వేలు చేతిలో పెట్టబోతున్నామని తెలిపారు. ఈ పథకం అమలు పైనా దృష్టిపెట్టాలి.