బాబు భయపెట్టారు : జగన్ వస్తే రాయలసీమ ఎడారి
కర్నూలు : జగన్ వస్తే.. రాయలసీమ ఎడారిగా మారిపోతుందని ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు. జగన్ కు ఓటు వేస్తే మోడీకి వేసినట్లే అన్నారు. జగన్ అధికారంలోకి వస్తే

కర్నూలు : జగన్ వస్తే.. రాయలసీమ ఎడారిగా మారిపోతుందని ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు. జగన్ కు ఓటు వేస్తే మోడీకి వేసినట్లే అన్నారు. జగన్ అధికారంలోకి వస్తే
కర్నూలు : జగన్ వస్తే.. రాయలసీమ ఎడారిగా మారిపోతుందని ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు. జగన్ కు ఓటు వేస్తే మోడీకి వేసినట్లే అన్నారు. జగన్ అధికారంలోకి వస్తే సాగునీటి ప్రాజెక్టులు ఆగిపోతాయన్నారు. కర్నూలు జిల్లా ఆలూరులో టీడీపీ ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు పాల్గొన్నారు. జగన్, కేసీఆర్, మోడీలపై విరుచుకుపడ్డారు. ప్రధాని మోడీ ఏపీ ప్రజలకు నమ్మక ద్రోహం చేశారని ఆరోపించారు. ఏపీకి రావాల్సిన లక్ష కోట్లు కేసీఆర్ ఇవ్వడం లేదన్నారు. అలాంటి వ్యక్తులతో జగన్ దోస్తీ చేశారని మండిపడ్డారు. కేసుల నుంచి బయటపడేందుకు మోడీకి, ఆస్తులను కాపాడుకునేందుకు కేసీఆర్ కు జగన్ ఊడిగం చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అవినీతికి మోడీ కాపలాదారుగా ఉన్నారని అన్నారు.
Read Also : బ్రాహ్మణి స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేస్తా జగన్ హామీ
శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులు కేసీఆర్ కంట్రోల్ లో పెట్టాలని అంటున్నారని చంద్రబాబు సీరియస్ అయ్యారు. ముచ్చుమర్రి మూసివేయాలని అంటున్నారని, పోలవరం ప్రాజెక్ట్ ఆపేయాలని సుప్రీంకోర్టుకి వెళ్లారని చంద్రబాబు మండిపడ్డారు. వారి బెదిరింపులకు భయపడేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. త్వరలోనే వేదావతి ప్రాజెక్ట్ పూర్తి చేస్తామన్నారు. రాయలసీమను రతనాల సీమగా మారుస్తామని హామీ ఇచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు.
పేదవారికి పింఛన్ ఇవ్వడం వైసీపీకి ఇష్టం లేదన్నారు. పసుపు-కుంకుమ, అన్నదాత సుఖీభవ పథకాలను అడ్డుకునేందకు కోర్టు కెళ్లాలరని చంద్రబాబు మండిపడ్డారు. రూ.2వేల పింఛన్ ను రూ.3వేలకు పెంచామన్నారు. టీడీపీ ప్రభుత్వం వస్తే ఇంటర్ అర్హతతోనే నిరుద్యోగ భృతి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. పేదవారి ఆసుపత్రి ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. సంపద సృష్టించి పేదలకు పంచుతామని చంద్రబాబు చెప్పారు. జాబు కావాలంటే బాబు మళ్లీ రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. సాంకేతిక సాయంతో సుపరిపాలన అందిస్తామన్నారు. మోడీ గెలిస్తే ముస్లింలకు చాలా ఇబ్బందులు వస్తాయని చంద్రబాబు హెచ్చరించారు.
Read Also : అవినీతి కోట తలుపులు బద్దలు కొడతా : పవన్