ఎన్నికల డ్యూటీలో మహిళా కానిస్టేబుల్ మృతి

ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 11వ తేదీన జరిగిన ఎన్నికలు ఉద్రిక్తత పరిస్థితుల మధ్య ముగిశాయి

ఎన్నికల డ్యూటీలో మహిళా కానిస్టేబుల్ మృతి

Updated On : April 11, 2019 / 12:18 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 11వ తేదీన జరిగిన ఎన్నికలు ఉద్రిక్తత పరిస్థితుల మధ్య ముగిశాయి

ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 11వ తేదీన జరిగిన ఎన్నికలు ఉద్రిక్తత పరిస్థితుల మధ్య ముగిశాయి. పలు నియోజకవర్గాల్లో జరిగిన వివాదాల్లో కార్యకర్తలు, ఆందోళనకారులతో పాటు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. అయినప్పటికీ ఎలక్షన్ ముగిసేంతవరకూ రక్షకభటులు తమ విధులకే అంకితమైయ్యారు. 
Read Also : RRB ALP ఆప్టిట్యూడ్ టెస్ట్ వాయిదా

ఆంధ్రప్రదేశ్‌లోని ఉక్కు నగరం అయిన విశాఖపట్టణంలో విషాదం చోటు చేసుకుంది. నేషనల్ హైవే 16 మీద ఉన్న పంజాబ్ హోటల్ ప్రాంతంలో పోలింగ్ డ్యూటీ నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ మృతి చెందింది. మధురవాడకు సమీపంలో ఉన్న పీఎం పాలెం పోలీస్ స్టేషన్‌కు చెందిన లక్ష్మీ కాంతం(41) రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. 

తన ద్విచక్రవాహనంపై ఎన్నికల విధులు నిర్వర్తించేందుకు బయల్దేరింది. మార్గం మధ్యలో మహీంద్రా కారు ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి కొట్టేయడంతో తలతో పాటు శరీరానికి తీవ్రగాయాలైయ్యాయి. స్థానికులు అప్రమత్తమయ్యేలోపే అక్కడే ప్రాణాలు విడిచింది మహిళా కానిస్టేబుల్.  
Read Also : ఈవీఎంలపై ఈసీకి కాంగ్రెస్ 39 ఫిర్యాదులు